నిఖిల్ ‘అర్జున్ సురవరం’ మే 1న

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఠాగూర్ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ , ఔరా ఎంటర్ టైన్మెంట్స్  టి. ఎన్. సంతోష్ దర్శకత్వంలో రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “అర్జున్ సురవరం”. ఈ చిత్రం డేట్ ఎనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్ సిద్దార్థ్, సమర్పకుడు ఠాగూర్ మధు, నిర్మాత రాజ్ కుమార్ ఆకెళ్ల పాల్గొన్నారు.
 
హీరో నిఖిల్ మాట్లాడుతూ… ‘హ్యాపీ డేస్’ నుండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా థాంక్స్. ఇది నా 16వ చిత్రం. టాప్ రిపోర్టర్ అవ్వాలనుకునే అర్జున్ క్యారెక్టర్ ని ఈ చిత్రంలో ప్లై చేస్తున్నాను. ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, పడగొట్టాలన్న మీడియా కి పవర్ ఉంటుంది. మీడియాలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ అన్ని విషయాలు ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నా కేరియర్ లొనే మోస్ట్ రెస్పాన్స్ బుల్ గా ఫీలయి ఒళ్ళు దెగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. సినిమా అంతా కంప్లీట్ అయ్యింది. సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. మంచి డేట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మే 1న రిలీజ్ చేస్తున్నాం. నైజామ్ ఏషియన్ సునీల్ చేస్తున్నారు. ఆయనకి థాంక్స్. నా సినిమాలు పోస్ట్ పోన్ అయిన ప్రతిసారి హిట్ అయ్యాయి. మళ్ళి ఈ చిత్రం అలాగే జరిగింది. లక్కీగా ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. మా చేతిలో మంచి సినిమా రెడీగా ఉంది. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైనా.. సినిమా బాగా రావడానికి నిర్మాతలు ఠాగూర్ మధు, రాజ్ కుమార్ ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు..అన్నారు.
 
నిర్మాత రాజ్ కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ.. సినిమా బాగుండాలని లేట్ అయినా కాంప్రమైజ్ కాకుండా చేశాం. టాప్ టెక్నీ షియన్స్ అంతా ఈ సినిమాకి వర్క్ చేశారు. సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రాపర్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూశాం. ఇప్పుడు ఎన్నికల జోరు కొనసాగుతుంది. మా డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు అర్జున్ సురవరం చిత్రాన్ని మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం..అన్నారు