‘రాజరథం’ టీం మరో పాటని విడుదల చేసింది. ఏ ఆర్ రెహమాన్, హారిస్ జైరాజ్, మిక్కీ జే మేయర్ ల సారధ్యంలో పాడిన అభయ్ జోద్పుర్కర్ ఈ పాటకి స్వరాన్ని అందించారు. హీరో నిఖిల్ విడుదల చేసిన ఈ పాట మాల్షేజ్ ఘాట్, మహాబలేశ్వర్ వంటి అద్భుత ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. అద్భుతమైన పద ప్రయోగంతో సాగే ఈ పాటని రెండు రకాలుగా అన్వయించుకునేలా రాయడం విశేషం. భూమి, ఆకాశం, సూర్యుడిని ఉద్దేశించినట్లు కనిపించినా అంతర్లీనంగా సినిమాలో మూడు ముఖ్య పాత్రలు అభి, మేఘ, సూరజ్లకి అన్వయించుకునేలా ఉంటుంది. ఈ పాటని దర్శకుడు అనూప్ భండారి స్వరపరచగా రామజోగయ్యశాస్త్రీ సాహిత్యాన్ని అందించారు ఈ పాట కోసం ప్రఖ్యాత నిపుణులు చెన్నై ఆర్కెస్ట్రా, సాక్స్ రాజ, కొరియోగ్రాఫర్ బొస్కో సీజర్ వంటి వారు పనిచేయడం విశేషం. రాజ్ పొద్దార్ ప్రొడక్షన్ డిజైన్, విలియం డేవిడ్ కలర్ ఫుల్ ఫోటోగ్రఫీతో ఈ పాట చాలా అందంగా కనిపిస్తుంది.
మంచి ఫీల్‌తో, అచ్చ తెలుగు పదాలతో అందంగా చిత్రీకరించిన ఈ పాట అందర్నీ ఆకట్టుకునేలా రూపొందింది. నిరూప్ భండారి, అవంతిక శెట్టి, ఆర్య, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో టైటిల్ పాత్రలో కనిపించే రానా దగ్గుబాటితో రొమాంటిక్ కామెడీగా రూపొందించబడిన ఈ ‘రాజరథం’ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 16న విడుదలకి సిద్ధమవుతోంది. అనూప్ భండారి దర్శకత్వంలో జాలి హిట్స్ ప్రొడక్షన్స్ బేనర్లో అజయ్ రెడ్డి, అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్ శాస్త్రి నిర్మాతలుగా ‘రాజరథం’ చిత్రాన్ని రూపొందించారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘రాజరథం’ చిత్రంలో నిరూప్ భండారి, అవంతిక శెట్టి, పి.రవిశంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అజనీష్ లోక్‌నాథ్, ఎడిటింగ్: శాంతకుమార్, సినిమాటోగ్రఫీ: విలియమ్ డేవిడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధాకర్ సాజ, నిర్మాణం: జాలీహిట్స్ టీమ్, అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి, సంగీతం, స్క్రీన్‌ప్లే, రచన, దర్శకత్వం: అనూప్ భండారి.