ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్త మవుతుంది”డ్యూడ్”(DUDE) ఓటిటి. లాక్ డౌన్ సమయంలో వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు అనేక ఓటిటి లు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాయి. బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా అనేక ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలను అలరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఓటిటి లో విడుదల చేయడానికి ముందుకు రావడంతో ఇటీవల ఓటీటీలకు బాగా డిమాండ్ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో అటువంటి వారికి చేయూత నిచ్చేందుకు ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్త మవుతుంది”డ్యూడ్”(DUDE) ఓటిటి. మే 1 న సినీ అతిరధుల చేతులమీదుగా గ్రాండ్ గా “డ్యూడ్”(DUDE) ఓటిటి యాప్ విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోలో “డ్యూడ్”(DUDE) ఓటిటి లోగోను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన లక్ష్మి (ఈశ్వర్ తల్లి), హైమా లు యాప్ స్పాన్సర్ చేయగా ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైన్మెంట్ రాజీవ్, హీరోయిన్స్ డెబోరా డోరిస్ , హరిత, కమెడియన్ క్రేజీ అభి, డ్యూడ్ డైరెక్టన్ టీం చేతులమీదుగా “డ్యూడ్”(DUDE) ఓటిటి లోగోను విడుదల చేశారు.ఈ ఓటిటి లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న 10 మంది కొత్త దర్శకుల సినిమాల ట్రైలర్స్ ను ప్రదర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత” డ్యూడ్”(DUDE) ఓటిటి వ్యవస్థాపకుడు ఈశ్వర్ మాట్లాడుతూ…
ఈ రోజు “డ్యూడ్”(DUDE) ఓటిటి లోగోను మా తల్లి చేతులమీదుగా లాంచ్ చేయడం ఎంతో గర్వకారణం. “డ్యూడ్”( DUDE) ఓటిటి కు ఒక ప్రత్యేకత ఉంది. నేను,ధూళిపూడి కలసి ఈ డ్యూడ్ ఓటీటీకి నాంది పలికాము. ఇది ఇతర సాంప్రదాయ ఓటీటీల్లా కొందరి చేతుల్లోనే ఉండదు. ఈ ఓటీటీ ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిది. సినిమాని ప్రేమించే ప్రతి వ్యక్తి సొంతం. 24క్రాఫ్ట్స్ లో పనిచేసే అందరికి ఇది చక్కటి అవకాశం. నిర్మాతలుగా మారాలనే వారికి, నూతన నటులకి ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది డ్యూడ్ ఓటీటీ. చాలా మంది ప్రముఖులు, పెట్టుబడిదారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ ఓటిటి లో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్,లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా అన్ని రకాల కంటెంట్‌తో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తాం. “డ్యూడ్”(DUDE) ఓటిటి ని మే 1 న విడుదల చేస్తాం.కాబట్టి ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
ఈస్ట్ వెస్ట్ రాజీవ్ మాట్లాడుతూ.. యువతకు మంచి ప్రోత్సాహం ఇస్తే వారి ప్రతిభకు అవకాశం కల్పిస్తే వారంతా సమాజానికి ఉపయోగ పడే ఎన్నో మంచి చిత్రాలు తీసుకువస్తారని భావించిన ఈశ్వర్ బాబు, ధూళిపూడి ముందు చూపుతో సరికొత్తగా “డ్యూడ్” (DUDE) ఓటిటి అనే ఫ్లాట్ ఫామ్ ను తీసుకురావడం హర్శించదగ్గ విషయం అన్నారు.
స్పాన్సర్స్ సద్గురు,సమై శేకర్ లు మాట్లాడుతూ.. ఈశ్వర్ కమిట్మెంట్ నచ్చి మేము ఈ ఓటిటి కు స్పాన్సర్ చేస్తున్నాము. తెలుగులో ఉన్న ‘ఆహా’ అంత మంచి పేరు “డ్యూడ్”(DUDE) ఓటిటి కు రావాలి అన్నారు..