ప్రవీణ్ యండమూరి, శ్వేతా పరాశర్, యష్ పూరి, అజయ్ కతుర్వార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అలాంటి సిత్రాలు’. ఇప్పటి యువత ఆలోచన, ఆందోళనలు.. సమాజంలో జరిగే కొన్ని వాస్తవ అంశాలను ప్రతిబింబించేలా రూపొందించారు. ఈ న్యూ ఏజ్ సినిమా సెప్టెంబర్ 24 నుండి ‘జీ 5’ ఓటీటీలో వీక్షకులకు అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల సమావేశంలో…
“మా టెక్నికల్ టీమ్ లేకుండా ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ప్రధాన తారాగణం అంతా అద్భుతంగా నటించారు. మేమంతా ఈ వేదికపై నిలబడ్డామంటే రాఘవేంద్ర రెడ్డిగారు కారణం. నాకు ఏ అవసరం వచ్చినా నిలబడిన రాహుల్ రెడ్డి అన్నకు థాంక్స్. ‘అలాంటి సిత్రాలు’ సినిమా గురించి చెప్పాలంటే… ఎంటర్టైన్మెంట్ గురించి కంటే కంటెంట్ గురించి అందరూ మాట్లాడతారు” అని దర్శకుడు సుప్రీత్ సి. కృష్ణ మాట్లాడుతూ అన్నారు.
“ఈరోజు ‘జీ 5’ లాంటి గొప్ప ఓటీటీ వేదిక మా సినిమాను విడుదల చేస్తుండటం మాకు చాలా సంతోషంగా ఉంది. జీ సంస్థకు చెందిన అనురాధ మేడమ్, సాయి ప్రకాష్, నిమ్మకాయల ప్రసాద్ గారు థాంక్స్” అని చిత్ర సమర్పకులు రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ అన్నారు.
ప్రవీణ్ యండమూరి మాట్లాడుతూ.. ” ఇందులో నేను దిలీప్ అనే పాత్రలో నటించాను. గ్రే షేడ్ ఉన్న పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శకుడు సుప్రీత్ కి థాంక్స్. సినిమా విడుదల వరకూ వచ్చిందంటే, ఈ స్థాయిలో ఉందంటే రాఘవేంద్రరెడ్డి గారు, రాహుల్ రెడ్డి గారు ప్రధాన కారణం.మా సినిమాను విడుదల చేస్తున్న ‘జీ 5’కు థాంక్స్” అని అన్నారు.
యష్ పూరి మాట్లాడుతూ… “ఈ సినిమాలో రాగ్ పాత్రలో నటించాను. ఇంట్లో ఇంటీరియర్ కాంప్లెక్స్ గురించి ఫైట్ చేస్తూ… సొంత మ్యూజిక్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించే ఓ యువకుడు. మంచి పాత్రలో నటించాను. ఇదొక డ్రీమ్ టీమ్. వీళ్ళతో పని చేసినందుకు సంతోషంగా ఉంది” అని అన్నారు.
అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ.. “ఇందులో నేనొక బాక్సర్ పాత్రలో నటించాను. అతని వ్యక్తిగత-వృత్తిపరమైన జీవితాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? అనేది సినిమాలో చూపించారు. నాకు, యామినికి మధ్య క్యూట్ లవ్ స్టోరీ ఉంది. టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. మీడియా, ప్రేక్షకులకు థాంక్స్. మా సినిమాను తప్పకుండా చూడండి. ఇందులో చూపించినవన్నీ మంచి సిత్రాలే ” అని అన్నారు.
“నేను యామిని పాత్రలో నటించాను. సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన ఆమె ప్రేమలో ఎలా పడిందనేది ఆసక్తికరం. యష్, యామినికి మధ్య మంచి ప్రేమకథ ఉంది. మా కథతో పాటు సినిమాలో మరో మూడు ప్రేమకథలు ఉన్నాయి” అని తన్వి మాట్లాడుతూ అన్నారు.
ఈచిత్రానికి రచన, దర్శకత్వం : సుప్రీత్ సి. కృష్ణ. ప్రొడక్షన్ డిజైన్: రోహన్ సింగ్, ఎడిటింగ్, సౌండ్ డిజైన్: అశ్వథ్ శివకుమార్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ శివకుమార్, మ్యూజిక్: సంతు కుమార్, సమర్పణ: కె. రాఘవేంద్రరెడ్డి, ప్రొడ్యూసర్స్: సుప్రీత్ సి. కృష్ణ, లొక్కు శ్రీ వరుణ్, డి. రాహుల్ రెడ్డి.
ఇరవైమూడేళ్ల రాగ్ గాయకుడు, గిటారిస్ట్. అతడు తన కంటే వయసులో పెద్దదైన ఓ వ్యభిచారి పట్ల ఆకర్షితుడవుతాడు. ఆమె జీవితంలో కొట్లాట, గొడవలు మానేసి సాధారణ జీవితం గడపాలని ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌స్టర్ దిలీప్ పాత్రేమిటి? బాక్సర్ కావాలని కలలు కనే యష్‌కు, ఈ ముగ్గురి కథకు సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి…