దగ్గుబాటి హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రానా, వెంకటేష్ లతో ‘రానా నాయుడు’ అనే డ్రామా సిరీస్‌ను తెరకెక్కించేందుకు సిద్దమైంది నెట్ ఫ్లిక్స్. లోకోమోటివ్ గ్లోబర్ ఇంక్. అనే సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అమెరికన్ పాపులర్ డ్రామా ‘రే డోనోవన్’ షో టైం నుంచి కాన్సెప్ట్‌ను తీసుకున్నారు.
ఈ యాక్షన్ డ్రామాలో రానా నాయుడు జీవిత కథ ఉండబోతోంది. బాలీవుడ్లో ప్రముఖులకు వచ్చిన సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా కనిపించబోతోన్నారు. ఈ ప్రాజెక్ట్ హక్కులను వయకాయ్ సీబీఎస్ గ్లోబల్ డిస్ట్రీబ్యూషన్ గ్రూప్ సొంతం చేసుకుంది. కరన్ అన్షుమాన్ షో రన్నర్ మాత్రమే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. సుపర్న్ వర్న కో డైరెక్టర్‌గా పని చేయనున్నారు.
“మా చిన్నాన్నతో కలిసి మొట్టమొదటి సారిగా నటించడం, అది కూడా నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది. ఇది మా కెరీర్లోనే ఎంతో భిన్నమైన ప్రాజెక్ట్ “… అని రానా దగ్గుబాటి మాట్లాడుతూ అన్నారు.
“రానాతో ఇది మాకు పర్ఫెక్ట్ ప్రాజెక్ట్. నేను రాయ్ డోనోవన్‌కు వీరాభిమానిని. ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా’”.. అని వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ అన్నారు.