ఐటి యుగంలో ఉన్నాకూడా దేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక అమ్మాయి పై అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ఓ మహిళ తన జీవితాన్ని చిద్రం చేసిన ఓ మానవ మృగం పై తీర్చుకున్న పగ నేపథ్యంలో తెరకెక్కిన లఘు చిత్రం ‘భూమి’. నజియా షేక్, అరుణ్ బాబు, సతీష్ సారిపల్లి, లక్ష్మి కళ్యాణి ముఖ్య పాత్రల్లో రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో నజియా షేక్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నజియా షేక్ నిర్మించిన షార్ట్ ఫిలిం ‘భూమి’. ఈ చిత్రానికి కెమెరా దిలీప్ కె కుమార్. ఈ లఘు చిత్రం ప్రివ్యూ కి ముఖ్య అతిధులుగా యువ హీరో సుధాకర్ కొమాకుల, దర్శకులు హరినాధ్ బాబు, యోగి కుమార్, జనార్దన్ ఎడ్వార్డ్ యోయో ముకుంద్, నిర్మాత రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
సుధాకర్ కొమాకుల మాట్లాడుతూ.. “నిజంగా ఇలాంటి కథను ఎంచుకున్న నజియా గారిని అభినందిస్తున్నాను. నిజంగా ఈ షార్ట్ ఫిలిం చూసాక ఆమెపై చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ను కమర్షియల్ వే లో కాకుండా, చాలా బోల్డ్ క్యారెక్టర్ చేయడం.. నిజంగా ఈ మేకింగ్ కు హాట్స్ హాఫ్ చెప్పాలి, దర్శకుడు రాఘవేంద్ర నిజంగా నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు.నేషనల్ అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నజియా షేక్ మాట్లాడుతూ.. “ఈ కథను రాఘవేంద్ర చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. మనం ఇప్పటి వరకు అమ్మాయిలపై జరిగిన దాడుల గురించి చర్చించిన కథలను చూసాం, కానీ ఇందులో ఒక బాధితురాలి వేదన ఎలా ఉంటుంది అన్న కోణంలో కథ చెప్పడం జరిగింది. ఈ పాత్ర నేనే పోషించాను. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు, కెమెరా మెన్ దిలీప్ చాలా కష్ట పడ్డారు. రాజీవ్ గారికి ముందు థాంక్స్ చెప్పాలి.. సినిమా 30 మినిట్స్ ఉన్నా కూడా.. ‘అది ఎంత సేపు ఉందన్నది కాదు కంటెంట్ ముఖ్యం’ అని అయన ఈ సినిమా తీసుకున్నారు. ఇది ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఎం ఎక్స్ మీడియా లో విడుదల అవుతుంది” అన్నారు.
అరుణ్ బాబు మాట్లాడుతూ.. “రెండేళ్ల క్రితం ‘రాణి’ అనే ఫీచర్ ఫిలిం చూసాను.. ఆ సినిమా అయ్యాక చాలా సేపు అలాగే కూర్చున్నా. నేను కూడా ఇలాంటి దర్శకుడితో పనిచేస్తే బాగుండు అనిపించింది. ఆ తరువాత “సంభవామి యుగే యుగే” అనే షార్ట్ ఫిలిం చేశాను. రాఘవేంద్ర కటారితో మాట్లాడాక నేను ‘భూమి’ వెంటనే చేస్తానని చెప్పాను. ఈ ఫిలిం లో బాత్ రూమ్ పార్ట్ చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి.. నిజంగా చాలా గొప్పగా ప్రెజెంట్ చేసాడు రాఘవేంద్ర. తప్పకుండా గొప్ప దర్శకుడు అవుతాడు” అన్నారు.
దర్శకుడు రాఘవేంద్ర మాట్లాడుతూ.. “నేను ‘రాణి’ ఫిచర్ ఫిలిం ఆగిపోయినప్పుడు నజియా గారు సపోర్ట్ చేసారు. ఆ తరువాత ఈ షార్ట్ ఫిలిం గురించి ఆమె నాతొ డిస్కషన్ చేశారు. కెమెరా దిలీప్ చాలా కష్టపడి మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. అలాగే మ్యూజిక్, ఎడిటింగ్ అందరికి నేను థాంక్స్ చెప్పాలి. అలాగే అరుణ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. అరుణ్ చాలా ఇవాల్వ్ అయి నటించాడు.. నజియా కు పోటీగా నటించారు. ఈ నాలుగు పాత్రలు చాలా అద్భుతంగా పండించారు” అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు హరినాధ్, యోగి కుమార్, యో యో ముకుంద్ తదితరులు టీం ను అభినందించారు.