‘విఘ్నేష్‌శివన్ ప్రేమలో నేను చాలా సంతోషంగా ఉన్నా. నా కలల్ని సాకారం చేసుకోవడంలో అతను ఎంతో తోడ్పాటునందిస్తున్నారు. విఘ్నేష్ సాంగత్యంలో మునుపెన్నడూలేని సంతోషాన్ని, మనశ్శాంతిని ఆస్వాదిస్తున్నాను’ అని చెప్పింది నయనతార. నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. విదేశాల్లో ఈ జంట చెట్టపట్టాలేసుకొని విహరించిన ఫొటోలు సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకున్నాయి. నయనతారతో ప్రేమాయణం గురించి విఘ్నేష్‌శివన్ పలు సందర్భాల్లో స్పందించారు. నయనతార మాత్రం తొలిసారి.. ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో విఘ్నేష్‌శివన్‌తో ప్రేమ వ్యవహారం గురించి తొలిసారి పెదవి విప్పింది నయనతార. ‘విఘ్నేష్‌శివన్ ప్రేమలో నేను చాలా సంతోషంగా ఉన్నా. నా కలల్ని సాకారం చేసుకోవడంలో అతను ఎంతో తోడ్పాటునందిస్తున్నారు. విఘ్నేష్ సాంగత్యంలో మునుపెన్నడూలేని సంతోషాన్ని, మనశ్శాంతిని ఆస్వాదిస్తున్నాను’ అని చెప్పింది.
నీ పరిచయం తర్వాత అన్నీ మధుర క్షణాలే!
విఘ్నేష్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన ‘నానుమ్ రౌడీదాన్’ విడుదలై నాలుగేళ్లయింది.‘నానుమ్ రౌడీదాన్’ చిత్రానికి విఘ్నేష్‌శివన్ దర్శకత్వం వహించారు. అప్పుడే ఈ జంట మధ్య ప్రేమ చిగురించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో నయనతారను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు…
“నీ పరిచయం తర్వాత నా జీవితంలో అన్నీ మధుర క్షణాలే. ఈ ఆనందానికి కారణమైనందుకు ధన్యవాదాలు.ధన్యవాదాలు బంగారం. ఈ సినిమా ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. అలాగే నా జీవితం బాగుండే అవకాశం ఇచ్చావు.ఆ దేవుడి ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉండాలి. నువ్వు బయట, లోపల ఎప్పుడూ ఇంతే అందంగా ఉండాలి. బోలెడంత ప్రేమతో’’ అంటూ నయన పట్ల తనకున్న ఫీలింగ్‌ని షేర్ చేశారు విఘ్నేష్ శివన్. ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా అప్పుడే విఘ్నేష్, నయన ప్రేమలో పడ్డారు . అప్పటినుంచి ఇప్పటివరకూ కలిసి విహార యాత్రలకు వెళ్లడం, ఒకరి పుట్టినరోజుని మరొకరు ఘనంగా జరపడం, పండగలను కూడా కలిసి జరుపుకోవడం.. ఇలాంటివన్నీ ఇద్దరి మధ్య అనుబంధం బలపడిందని చెప్పడానికి ఉదాహరణలు. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంరని అంటున్నారు.నయనతార, రజినీకాంత్ తో నటించిన ‘దర్బార్’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది.