‘లేడీ సూపర్‌స్టార్’ నయనతార తన స్థాయిని పెంచుకుంటూపోతోంది. మొదట్లో ఆమెకు గ్లామర్ పాత్రలే వచ్చినా… ఇప్పుడు నటనకు అవకాశం ఉన్న పాత్రలు వరిస్తున్నాయి. ఇకపోతే నయనతార వ్యక్తిగతంగానే పలు వదంతులు ..విమర్శలను ఎదుర్కొంటోంది. ఆమె తన చిత్రాల ప్రారంభోత్సవాల్లోనూ… ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనదు. నయనతార తను నటించిన ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు రాదు. అది ఎంత పెద్ద చిత్రం అయినా..చివరికి సొంత చిత్రం అయినా . ఇటీవల విజయ్‌కు జంటగా నటించిన ‘బిగిల్’ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటుందని ప్రచారం జరిగింది. అలాగే చిరంజీవికి జంటగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రచార కార్యక్రమానికి వస్తుందని అన్నారు. .అయితే యథాతథంగా నయనతార డుమ్మా కొట్టింది. చివరికి … నయనతార తన ప్రియుడిని నిర్మాతగా చేస్తూ నిర్మిస్తున్న ‘నెట్రికన్’ చిత్ర ప్రారంభోత్సవానికి కూడా రాలేదు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా .. అసలు విషయాన్ని నయనతార తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధ పడిందట. తాను ఏ చిత్ర ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నా ఆ చిత్రాలు బాగా ఆడలేదని చెప్పిందట. ఆ సెంటిమెంట్ కారణంగానే తాను చిత్ర ప్రారంభోత్సవాల్లోనూ..ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని చెప్పిందట . దీంతో నయనతారలో కూడా ఇంత సెంటిమెంట్ ఉందా? అంటూ ఆశ్యర్యపోతున్నారు. ఇక నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ జంట చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ‘నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లికి సిద్ధం అయ్యారని…వీరి పెళ్లి విదేశంలో డిసెంబర్ 25న’ .. అంటూ ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే వీటికి ఫుల్స్టాప్ పెట్టే విధంగా నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు….”ఎవరేమైనా రాసుకోండి. దాని గురించి మాకు బాధ లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. అసలు ఆ విషయం గురించి వివరించడం కుదరద”ని పేర్కొన్నాడు.
మహిళలు ధైర్యంగా నిలబడాలి !
“అధికారం ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి?” అని ప్రశ్నిస్తున్నారు నయనతార. ఒకవైపు టాప్ హీరోలతో చేస్తూ.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఎదిగారు నయనతార. తనకి సంబంధించిన పనులు తనకు నచ్చినట్టే జరగాలని అనుకుంటారు నయనతార. ‘సినిమా ఇండస్ట్రీలో అధికారం’ అనే విషయం గురించి నయనతార మాట్లాడుతూ– ‘‘అధికారం ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? నేను సోలో హీరోయిన్గా చేసే సినిమాల్లో తుది నిర్ణయాలన్నీ నావే. సమస్య ఏంటంటే.. స్త్రీలు పై స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఉండాల్సి నంత ధైర్యంగా ఉండరు. ‘నేను ఇది చేస్తాను..నాకు అది కావాలి’ అని ధైర్యంగా నిలబడరు.నేను నీ మాట విన్నప్పుడు.. నువ్వు కూడా నా మాట వినాలి కదా? మహిళలు ధైర్యంగా నిలబడాలి” అన్నారు.