నయనతారకి ఐదు నెలల్లో మూడు ఫ్లాపులు పెద్ద షాక్ ఇచ్చాయి. సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా నయనతార 2018 సంవత్సరంలో మూడు వరుస విజయాలు సాధించింది . 2019లో ‘విశ్వాసం’ చిత్రంవరకూ హవా కొనసాగించిన నయన్ ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఐదు నెలల్లో మూడు ఫ్లాపులు నయనతారకి పెద్ద షాక్ ఇచ్చాయి. వాటిలో ముందుగా నయనతార నటించిన ‘ఐరా’ మార్చిలో విడుదల కాగా, ఈచిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక మేలో విడుదలైన ‘మిస్టర్ లోకల్’ కి కూడా అదే ఫలితం దక్కింది. ఇక గత వారం విడుదలైన ‘కొలైయుతిర్ కాలమ్’ అనే మర్డర్ మిస్టరీ చిత్రం ప్రేక్షకులని అలరించలేకపోయింది. దీంతో నయన ఖాతాలో మూడు వరుస ఫ్లాపులు చేరాయి. అయితే ఆమె నటించిన ‘సైరా’ చిత్రంతో పాటు విజయ్ ‘బిజిల్’, రజనీకాంత్ ‘దర్భార్’ చిత్రాలు విడుదల కావలసి ఉంది. వీటిపైన నయన్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు
ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యేలా
నయనతార ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ.. సూపర్‌హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటోంది. నయన్ డేట్స్ దొరికాలంటే ఎవరైనా ఎదురుచూడాల్సిందే. అలాంటి నయన్.. సినిమా ఫంక్షన్లకు, ప్రమోషన్లకు అసలు హాజరు కాదు. కానీ మొదటి సారి తన నియమాలను పక్కన పెట్టేసినట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సైరా’లో నయనతార హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యేలా చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఒప్పించినట్టు తెలుస్తోంది. చరణ్ విజ్ఞప్తి మేరకు నయన్ కూడా ఓకే చెప్పేసినట్టు సమాచారం. మరి ‘సైరా’ ప్రమోషన్స్ లో నయన్ పాల్గొంటే మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.