నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో ‘శివలింగ’, ‘విక్రమ్ వేదా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ నిర్మాతగా ట్రైడెంట్ ఆర్ట్స్ (Trident Arts ) పతాకం పై తమిళం లో నిర్మించబడుతున్న ‘ఆరమ్’ (Araam) చిత్రాన్ని తెలుగు లో ‘కర్తవ్యం’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా చిత్రం. నయనతార జిల్లా కలెక్టర్ గా మనకు కనువిందు చేస్తున్నారు.
వరుస విజయాలతో, డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ తో దూసుకువెళుతున్న నయనతార ఈ చిత్రంలో జిల్లా కలెక్టర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు . ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రం తెలుగు హక్కులు సొంతం చేసుకొనడంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ‘చక్రం’, ‘డేంజర్’ మరియు ‘కృష్ణార్జున’ చిత్రాలకి పనిచేసిన ఓం ప్రకాష్ ఈ చిత్రానికి కెమరామెన్ గా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యాక్రమాలలో బిజీ గా ఉంది. త్వరలో విడుదల అవుతుంది.
నయనతార, విగ్నేష్, రమేష్, సును లక్ష్మి, వినోదిని వైద్యనాథన్, రామచంద్రన్ దురైరాజ్,ఆనంద్ కృష్ణన్ నటించిన ఈ చిత్రానికి కెమెరా : ఓం ప్రకాష్, మ్యూజిక్ : జీబ్రాన్, ఎడిటింగ్ : గోపి కృష్ణ, కథ దర్శకత్యం : గోపి నైనర్, నిర్మాత : ఆర్ రవీంద్రన్
Nayanathara’s Political Drama film ‘Aramm’ in Telugu
Lady Super Star Nayanathara’s Political Drama film ‘Aramm’ is being dubbed in Telugu as ‘Kartavyam’. Popular producer and distributor, R Ravindran, who produced and distributed super hit films like ‘Siva Linga’ and ‘Vikram Vedha’ is releasing this film in Telugu. He brought the dubbing rights under Trident Arts banner and will release the film simultaneously along with Tamil film.
Trident Arts banner is popular Production and distribution house. They produced super hit films like Siva Linga and Vikram Vedha and distributed more than 450 films, Most of the films are super hit. R Ravindran is very happy to bag Kartavyam film and he is confident movie success.
‘Kartavyam’ is a Political Drama film directed by Gopi Nainar. Ghibran composed music and Om Prakash handling the Camera department.
Vignesh, Ramesh, Sunu Lakshmi, Vinodhini Vaidyanathan, Ramachandran Durairaj and PV Anand Krishnan plays other important roles.