కార్తికేయ, హిమాన్సీ, శభాంగి పంతే జంటగా నటిస్తోన్న చిత్రం `ఇట్లు …అంజలి`. వొమా ప్రొడక్షన్స్ పతాకంపై నవీన్ మన్నేల స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్టు లుక్ ను బుధవారం హైదరాబాద్ సారథి స్టూడియో లో సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ` సినిమా టైటిల్ బాగుంది. హీరో చాలా కాలం నుంచి తెలుసు. మంచి వ్యక్తి. ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. భవిష్యత్ లో చిరంజీవి అంత పెద్ద స్టార్ కావాలి` అని అన్నారు.
చిత్ర దర్శక, నిర్మాత నవీన్ మన్నేల మాట్లాడుతూ, ` లవ్ లెటర్ బ్యాక్ డ్రాప్ లో కథ సాగుతుంది. చక్కని ఫీల్ గుండ్ ఎంటర్ టైనర్. ప్రతీ సన్నివేశాన్ని నేచురల్ గా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. సినిమా చూస్తున్నంత సేపు సరికొత్త అనుభూతి కల్గుతుంది. మంచి సాహిత్యం…దానికి తగ్గ చక్కని ట్యూన్స్ చక్కగా కుదిరాయి. సినిమా విజయం, సాధించి అందరికీ మంచి పేరు రావాలి` అని అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ, `ఓ అమ్మాయి ప్రేమలేఖ చుట్టూ కథ తిరుగుతుంది. పోస్టర్ కొంచెం మాస్ లుక్ లో ఉన్నా సినిమా అంతా క్లాస్ గా ఉంది. కథనం ఆసక్తికరంగా సాగుతుంది. మాటలు, పాటలు హైలైట్ గా ఉంటాయి. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది` అని అన్నారు.
హీరోయిన్ హిమాన్సీ మాట్లాడుతూ, ` వైవిథ్యమైన ప్రేమకథా చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, హీరోలకు కృతజ్ఞతలు` అని అన్నారు.
సంగీత దర్శకుడు కార్తీక్ కొడగండ్ల మాట్లాడుతూ, ` కథకు తగ్గట్టు చక్కని పాటలు కుదిరాయి. పాటల కంపోజింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే టీజర్ , ట్రైలర్ , పాటలు విడుదల చేస్తాం` అని అన్నారు.
ఈ చిత్రంలో అనంత్, సైదులు వెంకీ, జబర్దస్త్ అవినాష్, టెంకాల నారి, అర్జున్, నవీన్, ధనుష్, సంజయ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వి.కె రామరాజు, ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్, ఆర్ట్: ఎస్. వి. మురళి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కరుణాకర్ నేరెళ్ళ, కో డైరెక్టర్: ఎమ్. సర్వేశరరావు, కథ, కథనం, మాటలు, దర్శకత్వం, నిర్మాత: నవీన్ మన్నేల.