‘బిగ్‌బాస్‌ 2’ హోస్ట్‌గా నాని !

పలు భాషల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్‌ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. గతేడాది తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన సంగతి తెలిసిందే. మరి త్వరలో ప్రసారం కానున్న సీజన్‌ 2లో ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారనే విషయంపై గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అదే సమయంలో కథానాయకుడు నాని హోస్ట్‌గా సందడి చేయనున్నారని తెగ ప్రచారం జరిగింది. ఇదే విషయం గురించి నానిని ప్రశ్నించగా.. ఇందులో నిజం లేదని ఖండించారు. అసలు ‘బిగ్‌బాస్ 2’ నిర్వాహకులు తనను సంప్రదించలేదని పేర్కొన్నారు.
 
అయితే శనివారం ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-2‌‌కు హోస్ట్‌కు సంబంధించి స్పష్టత లభించింది. దీనికి ‘నేచురల్‌ స్టారే’ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు నాని ట్విటర్‌లో అధికారిక ప్రకటన చేశారు. ‘బిగ్‌బాస్‌ 2’కు తానే వ్యాఖ్యాతనని చెబుతూ పోస్టర్‌ను పంచుకున్నారు. ‘బాబాయ్‌.. ఈసారి ఇంకొంచెం మసాలా’ అంటూ చిలిపిగా నవ్వుతున్న ఎమోజీని ట్వీట్‌ చేశారు. ఇంకేముంది వరుస విజయాలతో వెండితెరపై రాణిస్తున్న నాని‌.. ఇక బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారన్న మాట.
 
‘బిగ్‌బాస్‌’ తొలి సీజన్‌‌లో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తనదైన స్టైల్‌‌, జోక్స్‌తో అలరించారు. అత్యధిక టీఆర్పీ దక్కించుకున్న షోగా కూడా ఇది రికార్డు సృష్టించింది. నటుడు శివబాలాజీ సీజన్‌-1 విజేతగా నిలిచారు.

Star Maa announces Nani as the Host for Bigg Boss 2 

  • Natural Star Nani to debut as a TV host for Bigg Boss Telugu Season 2
  • Bigg Boss Season 2 Host reveal promo film to be released today on Star Maa

After a blockbuster success of Bigg Boss Season 1, Star Maa is all set to launch Season 2 with ‘Natural Star’ Nani as the host. The channel is currently at the top in viewership and is all set to take it higher with Bigg Boss season 2.

Alok Jain, Business Head of Star Maa Network quoted “We are extremely thankful to our viewers for stupendous response to Bigg Boss Season 1 and all our subsequent new shows.  We are excited to announce Nani as the host for Bigg Boss Season 2. With his ability to connect with audiences across all age segments, we look forward to this season being more exciting.”

Since the launch of season 2 call for entry promos for common people, the show has been generating a lot of buzz, curiosity and expectations. The show is unique with no script and the traditional word “cut”. The season 2 is going to be longer with more than 100 days compared to 70 days in last season. About 16 housemates will be locked inside a house completely cut off from the outside world , under the watchful gaze of 70 cameras that never stop rolling and millions of viewers will see housemates forge new relationships and maybe lose a few inside the house.

Actor Nani while sharing his excitement of hosting Bigg Boss 2 said, “Television is one of the most powerful mediums of entertainment and to come on it with a magnum opus like Bigg Boss is thrilling. I started my journey as a common man and have always experimented with distinct roles to entertain people. Looking forward to host Bigg Boss2.”

Like the promo says this season promises to be a lot more masala and excitement … Yedeina Jaragachu (Anything can Happen)