నాని, సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.36 చిత్రం `వి` సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీమతి అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మన్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు `ఎంసిఎ` డైరెక్టర్ శ్రీరామ్ వేణు క్లాప్ కొట్టగా.. `నేను లోకల్` దర్శకుడు త్రినాథరావు నక్కిన కెమెరా స్విచ్ఛాన్ చేశారు. `ఎఫ్2` డైరెక్టర్ అనీల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నటీనటులు:
నాని,సుధీర్ బాబు, అదితిరావు హైదరి,నివేదా థామస్
తనికెళ్ళభరణి,వి.కె.నరేష్,రోహిణి,వెన్నెలకిశోర్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
మేకప్: అర్జున్,కాస్ట్యూమ్స్: యన్.మనోజ్‌కుమార్,కాస్ట్యూమ్ డిజైనర్: రాజేష్, అశ్విన్
ప్రొడక్షన్ కంట్రోటర్: వి.చంద్రమోహన్,కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి,ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్‌స్టంట్స్: రవివర్మ
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్,డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పి.జి.విందా,సంగీతం: అమిత్ త్రివేది
నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి,రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి