“మంచి టీం దొరికినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పడానికి ‘శ్యామ్ సింగ రాయ్’ ఉదాహరణగా నిలిచిపోతుంది…అని అన్నారు నాని ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ.ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
“ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు నిర్మాత వెంకట్ గారికి థ్యాంక్స్. ప్రతీసారి వర్కవుట్ కాకపోవచ్చు. కానీ అన్ని సినిమాలకు పెట్టే శ్రమ మాత్రం ఒక్కటే. శ్యామ్ అమ్మ తెలుగు. నాన్న బెంగాలి. కథ విన్నప్పుడు నాకు ఓ హై వచ్చింది. ఇలా కనుక సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నాం. కాని అంతకంటే బాగా వచ్చింది. ఇప్పటి నుంచి ప్రతీ సినిమాలో ఇది వరకు చూడని నానినే చూస్తారు. టీజర్ కంటే సినిమా వంద రెట్లు ఉంటుంది” అని నాని అన్నారు.
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ..”టీజర్ చూసిన తరువాత మీ రియాక్షన్ చూసి నాకే ఏదో వచ్చింది. నేను కూడా నాని అభిమానినే. థియేటర్లో సినిమా చూసేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నాను. మీరు ఇప్పుడు చూసింది వంద సెకన్లే. సినిమాలో అంతకు మించి ఉంటుంది” అని అన్నారు.
కథా రచయిత సత్యదేవ్ జంగా మాట్లాడుతూ.. “విప్లవాత్మక ప్రేమ గాథ. రెండు భిన్న ధృవాలు. విప్లవం మనసుది. ప్రేమ హృదయానిది. ఈ రెండు కలగలిపే కథే శ్యామ్ సింగ రాయ్. నా కథ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఇంత స్థాయికి చేరుతుందని అనుకోలేదు. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన నాని గారికి థ్యాంక్స్. ఇది దృశ్య కావ్యంగా మారుతుంది” అని అన్నారు
నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా నటీ నటులు. సంగీతం : మిక్కీ జే మేయర్,సినిమాటోగ్రఫీ : సను జాన్ వర్గీస్, ఎడిటర్ : నవీన్ నూలి, ఫైట్స్ : రవి వర్మ,కొరియోగ్రఫీ : కృతి మహేష్, యశ్.