`మజిలీ` వంటి సూపర్ హిట్ అందుకున్నడైరెక్టర్ శివ నిర్వాణ ప్రేక్షకులను మెప్పించేలా `టక్ జగదీష్` రూపొందించనున్నారు. నాని నాయకుడిగా నటిస్తున్న 26వ చిత్రమిది. `నిన్నుకోరి` వంటి సూపర్‌హిట్ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `టక్ జగదీష్. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డైరెక్టర్ శివ అన్ని హంగులతో పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌తో `టక్ జగదీష్` రూపొందించనున్నారు. ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో పంటపొలాలు, విండ్ మిల్స్ బ్యాంక్‌గ్రౌండ్‌లో నాని పల్లెటూరి యువకుడిగా కనపడుతున్నారు.
`ఎవడే సుబ్రమణ్యం` తర్వాత నాని సరసన రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే `కౌసల్యకృష్ణమూర్తి` ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 2020 ప్రథమార్థంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)
కో డైరెక్టర్: లక్ష్మణ్ ముసులూరి, కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ్ కోన