వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. అనుపమ పరవేుశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్స్. మేర్లపాక గాంధీ దర్శకుడు. సినిమా ఏప్రిల్ 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో..
నాని మాట్లాడుతూ – ‘‘నా ప్రతి సినిమా విడుదలకు టెన్షన్ ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేస్తే టెన్షన్ అలవాటు పడిపోతుందని అనుకుంటే.. ప్రతి సినిమాకు టెన్షన్ కామన్‌గా వచ్చేస్తుంది. రెండు రోజులు ముందు సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. థియేటర్స్ చెకింగ్‌కి వెళ్లినప్పుడల్లా వీలుంటే కొన్ని సీన్స్ సినిమా చూసేస్తున్నాను. సినిమా అంతగా నచ్చేసింది. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా’’ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ – ‘‘సినిమాను ఏప్రిల్ 12న నేనే రిలీజ్ చేస్తున్నాను. మేర్లపాక గాంధీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కథను ముందు నాకే చెప్పాడు. సింపుల్ కథ… సినిమా విడుదలైన తర్వాత సూపర్‌హిట్ అయ్యింది. రెండో సినిమా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కూడా అంతే. తన సినిమాలో క్యారెక్టర్స్, కామెడీ, మ్యూజిక్ ఇలా అన్ని అంశాలు ప్యాకేజ్‌తో ఉంటాయి. ప్రేక్షకులకు పెద్దగా స్ట్రెయిన్ ఉండదు. ఎంజాయ్ చేస్తారు. నేను కూడా రీసెంట్గా ఈ సినిమా చూశాను. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, ఫస్టాఫ్ హిలేరియస్‌గా ఉంది. సెకండాఫ్ ఎంటర్టైన్మెంట్, కాస్త యాక్షన్ కలిసి ఉంటుంది’’ అన్నారు.
మేర్లపాక గాంధీ మాట్లాడుతూ – ‘‘ఏప్రిల్ 12న సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమాను దిల్‌రాజుగారు విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు.