నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా, ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వం లోరూపొందుతోన్న చిత్రం లో అందాల భామ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి “నా.. నువ్వే” అనే టైటిల్ ని నేడు చిత్ర బృందం అధికారికం గా ప్రకటించింది.
కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణం లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రఖ్యాత కెమరామెన్ పి. సి. శ్రీరామ్ ఈ చిత్రానికి అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఒక టోటల్ ఫ్రెష్ లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రం లో కనిపిస్తారు. ఈ చిత్రానికి అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతాన్ని అందిస్తున్నారు.
“జనవరి నెలాఖరు కి దాదాపు గా షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి “నా.. నువ్వే” అనే టైటిల్ చాలా అప్ట్ గా ఉంటుంది. ఒక నూతన కాన్సెప్ట్ తో, ఫ్రెష్ లుక్ తో ఈ చిత్రాన్ని దర్శకులు జయేంద్ర గారు తీర్చిదిద్దుతున్నారు. కళ్యాణ్ రామ్, తమన్నా ల కాంబినేషన్ ఈ చిత్రానికే హై లైట్ గా నిలుస్తుంది. పి. సి. శ్రీరామ్ గారి కెమెరా వర్క్ “నా.. నువ్వే” చిత్రానికి చాలా పెద్ద అసెట్ ” అని నిర్మాత ల లో ఒకరైన కిరణ్ ముప్పవరపు తెలిపారు.
“పి. సి. శ్రీరామ్, జయేంద్ర వంటి టాప్ క్వాలిటీ టెక్నికల్ టీం తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. హీరో కళ్యాణ్ రామ్ గారి కి ఈ చిత్రం ఒక టోటల్ మేకోవర్ ని ఇస్తుంది అని నమ్ముతున్నాం. వేసవి సెలవుల్లో చిత్రాన్ని విడుదల చేయటానికి సిద్ధపడుతున్నాం” అని సమర్పకులు మహేష్ కోనేరు తెలిపారు.
లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా గా ఉండే ఈ చిత్రం లో, కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖ వాణి ప్రధాన నటులు. ఇతర నటీ నటులు వివరాలు త్వరలో తెలుపుతాము అని యూనిట్ సభ్యులు తెలిపారు.
ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు , సంగీతం: షరెత్ , సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్ ,ఎడిటింగ్: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే – జయేంద్ర, శుభ, దర్శకత్వం: జయేంద్ర
Nandamuri Kalyan Ram – Tamannah’s Film Titled “Naa Nuvve”
Nandamuri Kalyan Ram’s and Tamannah are playing the lead roles in a romantic action thriller that is being directed by renowned ad film maker Jayendra. The movie has been titled “Naa Nuvve” and the first glimpse from the film has been revealed today, to an overwhelmingly positive reception.
The movie promises to be a complete makeover for Nandamuri Kalyan Ram and it is being made with top notch technical values. Famous cinematographer PC Sreeram is handling the camera while the award winning Sharreth is composing the music.
“Naa Nuvve” is being produced by Kiran Muppavarapu and Vijay Vattikuti on Cool Breeze Cinemas banner while Mahesh S Koneru is presenting the film on East Coast Productions banner. The film’s shoot is in the final stages and shooting is expected to be complete by the end of the month.
“Naa Nuvve is a very fresh, sensible and lovable film. Director Jayendra has taken a very novel concept and the combination of Kalyan Ram and Tamannah promises to be a special highlight in the movie. We have excellent music from Sharreth and beautiful visuals courtesy of P.C. Sreeram”, said Kiran Muppavarapu, who is one of the producers.
“Kalyan Ram has undergone a complete transformation for this movie. We are going with a top notch technical team and the film will offer a unique experience for movie lovers. We are aiming for a summer release for Naa Nuvve “, said Mahesh S Koneru.
Kalyan Ram, Tamannah, Tanikella Bharani, Posani Krishna Murali, Vennela Kishore, Praveen, Bitthiri Satti, Priya and Surekha Vani are some of the important actors in the film.
Music : Sharreth, Cinematography : P.C. SreeramEditing : T.S. SureshArt : Selva Kumar
Presented by : Mahesh S Koneru, Producer : Kiran Muvvavarapu and Vijay Vattikuti
Dialogues : Jayendra and Meeraq,Story – Screenplay – Jayendra and Subha
Direction – Jayendra