కేన్సర్ మీద ‘సింహ గర్జన’ చేయడానికి రెడీ అయ్యాడు నటసింహం నందమూరి బాలయ్య.అక్టోబర్ 28న వైజాగ్ వేెదికగా ఓ భారీ ర్యాలి జరగనుంది. ప్రముఖ నటి గౌతమి ప్రారంభించిన ‘లైఫ్ ఎగైన్ పౌండేషన్’ ద్వారా కేన్సర్ మీద ఎవెర్ నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ ని ఏర్పాటు చేసింది ఆ టీం.ఈ ప్రోగామ్ లో బాలకృష్ణతో పాటు అరకు ఎంపీ కొత్తపల్లి గీత , మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొని కేన్సర్ మీద అవగాహన కల్పించనున్నారు.
విశాఖ పట్నం ప్రాంతానికే చెందిన గౌతమి నటిగా మారి దక్షిణాది భాషలన్నింట్లో చిత్రాలు చేసి మంచిపేరు సంపాయించుకుంది . ఆ తరువాతి కాలం లో ఆమె కేన్సర్ బారిన పడింది . అయినా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చికిత్స పొంది కేన్సర్ ని జయించింది . ఆ తరువాత ‘లైఫ్ ఎగైన్ పౌండేషన్’ ద్వారా గౌతమి కేన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమం చేపట్టింది . ఇటీవల కొంతకాలం ప్రముఖ నటుడు కమలహాసన్ తో సహజీవనం చేసిన గౌతమి ఇప్పుడు అతనినుండి విడిపోయింది. త్వరలో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఆమె బీజేపీ తో సన్నిహితం గా ఉంటోంది .