సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న బాలకృష్ణ

‘నటసింహ’ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇది వరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. గడ్డం, మీసం ఉన్న లుక్‌లో బాలయ్యను చూసి థ్రిల్ అవుతున్నారు. మంగళవారం నుండి లోకల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సినిమాలో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు.
సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ
సోనాల్ చౌహాన్,వేదిక,ప్రకాశ్ రాజ్,భూమిక చావ్లా,జయసుధ
షాయాజీ షిండే,నాగినీడు,సప్తగిరి,శ్రీనివాస్‌రెడ్డి,రఘుబాబు,ధన్‌రాజ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్,కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి,మ్యూజిక్: చిరంతన్ భట్,సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, కొరియోగ్రఫీ: జానీ మాస్టర్