పి సి క్రియేషన్స్ పతాకం పై మనో ఆర్య, మహి వర్మ ప్రధాన తారాగణం లో మనోహర్ చిమ్మని దర్శకత్వం లో ప్రదీప్ చంద్ర నిర్మాతగా తెలంగాణ నేపధ్యం లో నిర్మించబడుతున్న తొలి తెలంగాణ చిత్రం ‘నమస్తే హైదరాబాద్’. ఈ చిత్రం యొక్క లోగో ను ఈరోజు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్ లో విడుదల చేసారు.
ఎక్కడ నుంచో ఎన్నో ఆశలు, ఆశయాలతో హైదరాబాద్ లో అడుగు పెట్టె యువతియువకులను ఈ హైదరాబాద్ మహానగరం ఎలా ప్రభావితం చేసి , వారి జీవితాలను ఏ గమ్యాలను చేరుస్తుంది అనేది ఈ సినిమా కథాంశం. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా వరంగల్ ఎం పి దయాకర్, ఎన్ శంకర్, రచ్చ రవి, యూనిట్ సభ్యులు పాల్గోన్నారు. ఈ చిత్రం లోగో ని వరంగల్ టీ ఆర్ ఎస్ ఎం పి దయాకర్ విడుదల చేసారు.
ఈ సందర్భంగా దర్శకుడు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ…. “ఇది పొలిటికల్ సినిమా కాదు, పక్క కమర్షియల్ ఎంటర్టైనర్. హైదరాబాద్ లో మరియు పరిసరప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ నేపథ్యంలో రియలిస్టిక్ గా రూపొందుతున్న పూర్తి స్థాయి కమర్షియల్ ట్రెండీ యూత్ ఎంటర్టైనర్ తెలంగాణ సినిమా ఇది. అందరు కొత్తవారితో నిర్మిస్తున్న చిత్రం ఇది. దీనికి ప్రొడ్యూసర్ అంటూ ఎవరు లేరు. మాకు సపోర్ట్ ఇచ్చే మిత్రులు శ్రోయోభిలాషులు సహాయం తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ తో ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నాం. మే చివరి వారం లో షూటింగ్ ప్రారంభిస్తాం , జులై ఆగష్టు లో నిర్మాణ అనంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము” అని తెలిపారు.
సంగీత దర్శకుడు, నిర్మాత ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ…. “మా చిత్రానికి నిర్మాత అంటూ ఎవరు లేరు. అందరం కలిసి నిర్మిస్తున్నాం. ఇందులో ఆరు పాటలు ఉన్నాయ్. హైదరాబాద్ ని కొనియాడేలా ఈ పాటలు ఉంటాయి. మాకుఅండగా మీడియా ఉంటుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు .
ఎన్. శంకర్ మాట్లాడుతూ…. “మన వరంగల్ ఎం పి దయాకర్ గారు ఒక కళాకారుడు, ఒక విసిఒన్ ఉన్న కళాకారుడు. తెలంగాణ తల్లీ విగ్రహానికి రూపకర్త, తాను ఈ వైదికకు రావటం చాల సంతోషం. హైదరాబాద్ అంటే ఒక అద్భుతం, ఒక ఫాంటసీ, ఒక అమ్మ ఒడి. హైదరాబాద్ లో అడుగుపెట్టిన అందరినీ వారి గమ్యానికి ఖచ్చితంగా చేరుస్తుంది. ఇలాంటి హైదరాబాద్ గురించి మన దర్శకుడు నమస్తే హైదరాబాద్ అనే టైటిల్ తో ఈ పట్టణం లో యువతి యువకుల జీవితాలు ఎలా ఉంటాయి అనే మంచి కథ తో, దర్శకుడు మనోహర్ చిమ్మని మంచిసినిమాని అందిస్తాడు అని నాకు నమ్మకం ఉంది. ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్” అని తెలిపారు.
వరంగల్ ఎం పి దయాకర్ గారు మాట్లాడుతూ…. “మేము ఉద్యమం లో ఉన్న సినిమాలు అంటే క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి రావటం చాల సంతోషం గా ఉంది. ఎం శంకర్ గారితో వేదిక పంచుకోవటం చాల సంతోషం గా ఉంది. నమస్తే హైదరాబాద్ అంటే మన సంప్రదాయం , మన ఊరి అందాలు , మన బిర్యానీ గుర్తుకు వచ్చింది. సినిమా టైటిల్ చాల అందం గా ఉంది, సినిమా బాగుంటుంది అని అనిపించింది. మంచి కమర్షియల్ హంగులతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు అని తెలిపారు. ఈ సినిమా మంచి హిట్ కావాలి అని ఆశిస్తున్నా” అని తెలిపారు.
నటి నటులు :
మనో ఆర్య, మహి వర్మ
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : మనోహర్ చిమ్మని
సంగీత దర్శకుడు, నిర్మాత : ప్రదీప్ చంద్ర, కెమెరా మాన్ : వీరేంద్ర లలిత్ ,ఎడిటింగ్ : నాగి రెడ్డి ఆర్ట్ : శ్రీనివాస్ చిమ్మని మాక్ అప్ : రఘు ,స్టిల్స్ : చిన్న పిఆర్యో : కేశవ