`మన్మథుడు` సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని కింగ్ నాగార్జున రూపొందిస్తున్న మరో ఎంటర్‌టైనర్ `మన్మథుడు 2`.మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) నిర్మిస్తున్న `మన్మథుడు 2` నేడు లాంఛనంగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. చిత్ర యూనిట్‌తో పాటు అక్కినేని అమల, నాగచైతన్య ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అమల అక్కినేని ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. అక్కినేని నాగచైతన్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరప్‌లో ప్రారంభం కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించనున్నారు. `RX100` ఫేమ్ చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
కింగ్ నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్,లక్ష్మి,వెన్నెలకిషోర్
రావు రమేష్,నాజర్,ఝాన్సీ,దేవదర్శిని తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి.కిరణ్
నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
మ్యూజిక్: చైతన్య భరద్వాజ్,సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
ప్రొడక్షన్ డిజైనర్స్: ఎస్.రామకృష్ణ, మౌనిక,స్క్రీన్‌ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్,ఎడిటర్స్: ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి,డైలాగ్స్: కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్,కాస్ట్యూమ్స్: అనిరుధ్ సింగ్, దీపికా లల్వాని