నాగార్జున, నాని సినిమా పేరు ‘దేవదాస్’

నాగార్జున , నాని మల్టిస్టార్టర్ ను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దేవదాస్’ టైటిల్ ను ఖరారు చేసారు. టైటిల్ పోస్టర్ లో గన్, బుల్లెట్స్, చారిటబుల్ హాస్పిటల్ హోడ్డింగ్ దర్శనమివ్వబోతున్నాయి. దర్శక నిర్మాతలు పోస్టర్ ను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. నేటి తరం యువతకు నచ్చే విధంగా సినిమా ఉండబోతోంది.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర నిర్మాణం చివారిదశలో ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ మరియు సి.ధర్మరాజు సమర్పణలో అశ్వినిదత్ నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా శ్రీధర్ రాఘవేంద్రన్, సత్యానంద్, సాయిమాధవ్ బుర్రా, భూపతి రాజా గారికి నిర్మాత అశ్వినీదత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
 
నటీనటులు: 
అక్కినేని నాగార్జున, నాని, రస్మిక మందన్న, ఆకాంక్ష సింగ్, సీనియర్ నరేష్,రావ్ రమేష్,అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్,సత్య.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: వైజయంతి మూవీస్
నిర్మాత: అశ్విని దత్
డైరెక్టర్: శ్రీరామ్ ఆదిత్య
కెమెరామెన్: శందత్ సైనుద్దీన్
మ్యూజిక్ డైరెక్టర్: మనిశర్మ
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
డైలాగ్స్: వెంకట్ డి పతి
కొరియోగ్రఫీ: బృంద, ప్రేమ్ రక్షిత్, శేఖర్ మాస్టర్
చీఫ్ కో.డైరెక్టర్: సదాశివ రావ్
ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్
పి. ఆర్.ఓ: వంశీ – శేఖర్