న‌వంబ‌ర్ 3న నాగ అన్వేష్, హెబ్బా పటేల్ ‘ఏంజెల్’

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. 45 నిమిషాలకు పైగా సీజీ సీన్స్ ఉండటంతో దాదాపు నాలుగు నెలలుగా ఏంజెల్ బృందం ఈ విజువల్ ఎఫెక్ట్స్ కోసం వ‌ర్క్ చేశారు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకొని ఏంజెల్ ను న‌వంబ‌ర్ 3న విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి మాట్లాడుతూ…. హాలీవుడ్ సినిమాలు ‘స్నో వైట్ అండ్ ద హంట్స్ మెన్’, ‘థార్’, ‘ఎవెంజర్స్’ వంటి సినిమాలకి గ్రాఫిక్స్ అందించిన సీజీ నిపుణుల పర్యవేక్షణలో ఏంజెల్ విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరిగిన‌ట్లు తెలిపారు. ఇక తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో కూడా ఏంజెల్ ను విడుదల చేస్తున్న‌ట్లుగా తెలిపారు. ముందుగా తెలుగు వెర్ష‌న్ నవంబర్ 3న విడుద‌ల చేసి ఆ త‌రువాత మ‌రో వారంలో హిందీ, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్న‌ట్లుగా సింధూరపువ్వుకృష్ణారెడ్డి ప్రకటించారు.

ద‌ర్శ‌కుడు బాహుబ‌లి ప‌ళ‌ని మాట్లాడుతూ…. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ తో పాటు బాలీవుడ్ స్టంట్ మాస్టర్ రవివర్మ కంపోజ్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్, సప్తగిరి, తాగుబోతు రమేశ్, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను కాంబినేషన్ లో ఉన్న కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు, సెంటిమెంట్ సన్నివేశాల్లో నాగ అన్వేష్ పలికించే ఎమోషన్స్, హెబ్బా గ్లామర్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఏంజెల్ అలరిస్తోందని పళని చెప్పారు.

హీరో నాగ అన్వేష్ మాట్లాడుతూ…. ఇప్పటికే విడుదలైన ఆడియోకి, ట్రైలర్ కి విశేష స్పందన లభిస్తున్నట్లుగా తెలిపారు. యూ ట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ అప్ లోడ్ చేసిన 24 గంటల్లోపే 10 లక్షలు వ్యూస్ రావడం చాలా హ్యాపీగా ఉంద‌ని అన్నారు. ఈ సినిమాకు బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెసరోలియో సంగీత దర్శకత్వం వహించారు. భీమ్స్ ఇచ్చిన ట్యూన్స్ కచ్ఛితంగా శ్రోతల్ని ఆకట్టుకుంటాయని ఏంజెల్ చిత్ర బృందం చెబుతోంది.

బ్యానర్
శ్రీ సరస్వతి ఫిల్మ్స్
తారాగణం
హీరో- నాగ అన్వేష్
హీరోయిన్- హేబా పటేల్
సుమన్, సప్తగిరి, కబీర్ ఖాన్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, సన
సాంకేతిక వర్గం
ప్రొడ్యూసర్- భువన్ సాగర్
డైరెక్టర్- ‘బాహుబలి’ పళని
సంగీత దర్శకుడు- భీమ్స్ సెసిరోలియో
సినిమాటోగ్రఫి – గుణ