నాగవర్మ బైర్రాజు హీరోగా.. దివ్యాసురేశ్ హీరోయిన్ గా.. ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్ నటిస్తూ.. హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ బైర్రాజు నిర్మిస్తున్న చిత్రం ‘విక్రమ్’. తమిళ్ లో ‘మహావీరన్’గా ఈ నెల 25 న విడుదల అవుతోంది.
హీరో, నిర్మాత నాగ వర్మ మాట్లాడుతూ… ‘విక్రమ్’ అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే ఈ చిత్రకథలోని పాత్రలు సమాజానికి దగ్గరగా… మనం నిత్యం చూసే వ్యక్తుల పాత్రలు మాదిరిగా సహజంగా ఉంటాయి. తన ప్రేమను సాధించడం కోసం ఆ రచయిత ఏం చేశాడు? అన్నది ఆసక్తికరంగా చెప్పాం. మాస్ యాక్షన్ సీన్స్ బాగా వచ్చాయి’ అన్నారు.
చిత్ర దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ… ‘ఇది పక్కా యాక్షన్ డ్రామా లవ్ స్టొరీ..ఇందులో నాగ వర్మ గారు హీరో గా పరిచయం అవుతున్నారు. ఈ పాత్రకు తగ్గట్టు చాలా కష్టపడి చేశారు. మహా క్యారెక్టర్ లో దివ్యాసురేశ్, ఆదిత్య ఓం, అలీ తమ్మడు కయ్యుమ్, పృద్వీ,జ్యోతి.. ఇలా వీరంతా చాలా ముఖ్యమైన రోల్ చేస్తున్నారు.అలాగే టెక్నిసిషన్స్ అందరూ చాలా కో ఆపరేట్ చేశారు’ అన్నారు.
ఆదిత్య ఓం మాట్లాడుతూ… ‘ఇందులో నేను నెగెటివ్ రోల్ చేశాను. సంగీతభరిత ప్రేమ కథకు థ్రిల్లర్ అంశాలను మేళవించి కొత్తపంధాలో ఈ చిత్రాన్ని మలిచారు.సినిమా బాగా వచ్చింది.ఈ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ ప్రసాద్, ఛాయాగ్రహణం: వేణు మురళీధర్, ఫైట్స్: శివప్రేమ్, ఎడిటర్ మేనగ శ్రీను.