నాగచైతన్య – సాయి పల్లవి ల ‘లవ్ స్టోరీ’

నాగచైతన్య , సాయి పల్లవి, శేఖర్ కమ్ముల మూవీకి తగ్గ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు .ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ కి ‘లవ్ స్టోరీ’ అనే పేరు పెట్టారు.
ఒక ఇంటెన్సిటీ ఉన్న పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ కి చాలా మంచి రెస్సాన్స్ వస్తోంది . ప్రేమలో కనిపించే బావోద్వేగాలను పోస్టర్ లో పలికించాడు శేఖర్ కమ్ముల. తను ఎలాంటి ప్రేమ కథను చెప్పబోతున్నాడో…ఆ ఫీల్ ని పోస్టర్ తో కలిగించాడు .
రెహామాన్ స్కూల్ నుండి పరిచయం అవుతున్న పవన్ అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని టీం చెబుతుంది.
ఈ చిత్రానికి సంబందించిన లాస్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం అవుతుంది. సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని టీం అంటుంది.
‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది. సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది.
 
ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆర్ట్:రాజీవ్ నాయర్,సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్,
సహా నిర్మాత : విజయ్ భాస్కర్, పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా,
డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల