ఒక జాతి చరిత్ర, సంస్కృతి, సమకాలీన నాగరికత లాంటి వాటికి ప్రతీకలు కళారూపాలు. అలాంటి ఆధునిక కళారూపం సినిమా. మనదేశంలో సినిమా పుట్టి 100 ఏళ్ళు గడిచారుు. తొలి తరం కష్టాలపైనే నేటి తరం వారు పలు సౌఖ్యాలను అనుభవిస్తున్నారు. ఆనాటి విశేషాలు తెలిసింది కొందరిేక. ఆ జ్ఞాపకాలను ఓ మ్యూజియంలో తిలకించడం అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. విదేశాల్లో ఈ తరహా మ్యూజియంలు ఎన్నెన్నో ఇప్పటిేక సందర్శకులకు అందుబాటులో ఉన్నారుు. మన దేశంలో మరో ఏడాదిలో ఈ తరహా మ్యూజియం రూపుదిద్దు కోనుంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లోని కొన్ని మ్యూజియంలపై కలర్స్ ప్రత్యేక కథనం…
వందేళ్ళ భారతీయ సినిమా గర్వించదగ్గ రీతిలో మనకూ ఓ సినిమా మ్యూజియం రూపొందనుంది. వచ్చే ఏడాదిలోగా ఈ కల నెరవేరనుంది. ముంబయిలో దీన్ని నిర్మించనున్నారు. కాలంతో పాటుగా భారతీయ సినిమాలో చోటు చేసుకున్న మార్పులు, అంతర్జాతీయ ప్రభావం లాంటివన్నీ ఇందులో చోటు చేసుకోనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ వెల్లడించారు. భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని కొన్ని ఆసక్తిదాయక ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. గత 100 ఏళ్ళలో భారతీయ సినిమాలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, వాటికి అద్దం పట్టేలా ఈ మ్యూజియం ఉంటుందని అన్నారు. పాత తరం కెమెరాలు, ఎడిటింగ్, రికార్డింగ్ యంత్రాలు, ప్రొజెక్టర్లు, కాస్ట్యూమ్స్, ఫోటోగ్రాఫ్‌లు, ఇతర వస్తువులెన్నో ఈ మ్యూజియంలో చోటు చేసుకోనున్నాయి. దుస్తులు, సెట్స్, టేప్స్, వింటేజ్ ఎక్విప్‌మెంట్, సినిమా రీళ్ళ కాపీలు, ప్రచార సామగ్రి, జీవిత చరిత్రలు, సౌండ్ ట్రాక్‌లు, ట్రయలర్స్, ట్రాన్స్‌పరెన్సీస్, సినిమా మ్యాగజైన్లు, సినిమా పంపిణికి సంబంధించిన గణాంక వివరాలు లాంటివన్నీ ఈ మ్యూజియంలో సినిమా అభిమానులకు కనువిందు చేయనున్నాయి.
ఇతర దేశాల్లో…
అమెరికా, బ్రిటన్, హాంకాంగ్, చైనా, మయన్మార్, పోర్చుగల్ తదితర దేశాల్లో ఉన్న సినిమా మ్యూజియంలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి.
చైనా నేషనల్ ఫిల్మ్ మ్యూజియం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ ఫిల్మ్ మ్యూజియంగా చైనా నేషనల్ ఫిల్మ్ మ్యూజియం ప్రసిద్ధి చెందింది. 2005లో ప్రారంభమైంది. 100 ఏళ్ళ చైనా సినిమాకు దర్పణం పట్టేలా ఇది రూపు దిద్దుకుంది. సినిమా టెక్నాలజీలకు ప్రదర్శన కేంద్రంగా కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. బీజింగ్‌లో 65 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నెలకొల్పారు. దీనిలో 20 శాశ్వత ప్రదర్శనశాలలు ఉన్నాయి. ఎగ్జిబిషన్లు, సమావేశాల కోసం మల్టీఫంక్షనల్స్ హాల్స్ ఉన్నాయి. తొలిసారిగా సినిమా రూపకల్పన, చైనా సినిమా పుట్టుక, తొలిదశలో అభివృద్ధి, విప్లవోద్యమ కాలంలో సినిమా, సంస్కరణల అనంతరం సినిమా, యానిమేషన్ సినిమాలు, పిల్లలు సినిమాలు, సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, డాక్యుమెంటరీలు…ఇలా థీమ్‌లను బట్టి ఇందులో అనేక వస్తువులు తదితరాలను చూడవచ్చు.
పోర్చుగల్‌లో…
పోర్చుగల్‌లోని మెల్గాకో మ్యూజియం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. పాత తరం నాటి యంత్రాలు, వస్తువులు, ఒరిజినల్ పోస్టర్లు, మరెన్నో రకాల డాక్యుమెంట్లను ఇక్కడ చూడవచ్చు. 2005 జూన్3న దీన్ని ప్రారంభించారు. ఇందులోని కలెక్షన్‌లో అత్యధిక శాతం సినీ అభిమాని జీన్ లూప్ పాసెక్ విరాళంగా అందించిందే.
కెనాడాలో…
కెనడాలోని క్యుబెక్ రాష్ట్రంలోని మోంట్రియల్‌లోని సినిమా మ్యూజియం 1963లో ప్రారంభమైంది. పాత కాలం నాటి సినిమా మ్యూజియంలో ఇది కూడా ఒకటి. వివిధ కాలాలకు, వివిధ దేశాలకు చెందిన 35,000కు పైగా సినిమాలు, 28,000కు పైగా పోస్టర్లు, 6,00,000కు పైగా ఫోటోలు, 2000కు పైగా చరితాత్మక వస్తువులు, 15,000 స్క్రిప్ట్‌లు, ప్రొడక్షన్ డాక్యుమెంట్లు, 45,000 పుస్తకాలు, 3,000 మ్యాగజైన్లు, మరెన్నో కాస్ట్యూమ్స్ తదితరాలు దీనిలో ఉన్నాయి. 1994-97 మధ్య కాలంలో దీన్ని మరింతగా ఆధునికీకరించారు.
మయన్మార్‌లో...
మన దేశంలో కంటే ముందుగానే పొరుగున ఉన్న మయన్మార్ తనకంటూ సొంతంగా మయన్మార్ మోషన్ పిక్చర్ మ్యూజియంను ఏర్పాటు చేసుకోవడం విశేషం. యాంగాన్‌లో దీన్ని నెలకొల్పారు. 1998 నవంబర్‌లో ఇది ఏర్పాటైంది.
స్పెయిన్‌లో…
స్పెయిన్‌లో గిరోనాలోని సినిమా మ్యూజియం బాగా ప్రఖ్యాతి చెందింది. 1998 ఏప్రిల్ 8న ఇది ప్రారంభమైంది. పర్మినెంట్ ఎగ్జిబిషన్ డిస్‌ప్లేలకు తోడుగా సినిమాపై విద్యాసంబంధిత కార్యకలాపాలు, సెమినార్లు, ఫ్రెండ్స్ ఆఫ్ ది మ్యూజియం క్లబ్, మ్యూజియం షాప్ లాంటివి దీని విశిష్టతలుగా చెప్పవచ్చు.
ఫ్రాన్స్‌లో…
పారిస్‌లోని ఈ మ్యూజియం సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకునేది. 1997 నాటి అగ్నిప్రమాదంలో ఇది ఆహుతైపోయింది. 1972లో హెన్రీ లాంగ్లోయిస్ దీన్ని ఏర్పాటు చేశారు. 5,000కు పైగా సినిమా సంబంధిత వస్తువులు దీనిలో ఉండేవి. ెమెరాలు, స్రిప్క్‌లు, స్టిల్స్, కాస్ట్యూమ్స్, సెట్స్ లాంటివెన్నో దర్శనమిచ్చేవి.
హాంకాంగ్‌లో...
హాంకాంగ్ ఫిల్మ్ అరె్కైవ్‌గా వ్యవహరితమయ్యే ఈ మ్యూజియం 2001 జనవరిలో ప్రారంభమైంది. పలు రకాల ఎగ్జిబిషన్లు, స్క్రీనింగ్స్, సెమినార్లు ఇక్కడ జరుగుతుంటాయి. ‘100 మస్ట్ సీ హాంకాంగ్ మూవీస్’ పేరిట రూపొందించిన జాబితా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.