చిత్రపరిశ్రమ అభివృద్ధి.. కళాకారుల సంక్షేమంపై సమీక్ష

అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జున లతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.సమావేశం నిర్వహించారు.
# చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ,కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్షించిన మంత్రి.
 
# ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన మంత్రి
 
# కల్చరల్ సెంటర్, స్కిల్ డవలప్ మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాలు సేకరణ చెయాలి
 
# సినీ, టి వి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశం
 
# సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకు త్వరితగతిన అనుమతులు
 
# Fdc ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపడతాం
 
# పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం