అనుష్క‌-మాధ‌వ‌న్ ‘సైలెన్స్’ లో మైఖేల్ మ్యాడ‌స‌న్

అనుష్క‌, మాధ‌వ‌న్ కాంబినేష‌న్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ” సైలెన్స్”. దాదాపు 100కి పైగా సినిమాల్లో న‌టించిన ‘కిల్ బిల్’ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ తొలిసారి ఈ ఇండియ‌న్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంస్థ‌తో క‌లిసి.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది.
 
క్వింటిన్ టోరంటినోస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ సినిమాలు ‘కిల్ బిల్’, ‘హేట్ ఫుల్ ఎయిట్’ మ‌రియు ‘రిస‌ర్వోయ‌ర్ డాగ్స్’ చిత్రాల్లో న‌టించిన హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ‌స‌న్, ‘బాహుబ‌లి’ ఫేమ్ సౌతిండియా లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క‌, పాన్ ఇండియా స్టార్ ఆర్.మాధ‌వ‌న్, సుబ్బ‌రాజు, అంజ‌లి, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.
 
పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సిఈవో విశ్వప్ర‌సాద్ మాట్లాడుతూ….ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులంద‌ర్నీ త‌ప్ప‌కుండా ఎంట‌ర్ టైన్ చేస్తుంది. అలాగే ఓ వినూత్న‌మైన సినిమా చూసామ‌నే ఫీలింగ్ క‌లిగిస్తుంది. ధియేట‌ర్ లో సినిమా పూర్తైన త‌ర్వాత స్టాండింగ్ వోవేష‌న్ ఇస్తార‌ని..అలాగే బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంద‌ని ఆశిస్తున్నాం. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యు.ఎస్.ఎ లోని సీయోట‌ల్ లో ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు షూటింగ్ చేయ‌నున్నాం. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ఈ మూవీ టీజ‌ర్ ను మేలో గ్రాండ్ గా యు.ఎస్. ఎ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలియ‌చేసారు.
 
ఈ చిత్రానికి డివోపి – షానియ‌ల్ కుమార్ డియో, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ – నాథ‌న్ బేక్స్, మ్యూజిక్ – గోపీ సుంద‌ర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – మైఖేల్ మ్యాడ‌స‌న్, దేవ్ పిన్న్, లైన్ ప్రొడ్యూస‌ర్ – ప‌త్స నాగ‌రాజ్, దుజాత ప్ర‌భు, కాస్టింగ్ డైరెక్ట‌ర్ – రేనీ గార్సియ‌, ఎంట‌ర్ టైన్మెంట్ అట‌ర్నీ – బ్రాండ‌న్ బ్లేక్, లోకేష‌న్ స‌ర్వీస‌స్ – నికోలే మిల్ స్టీడ్, ఎస్ఎజి కన్సుల్ టెంట్ – పాల్ రాయ్, కో – ప్రొడ్యూస‌ర్ – వివేక్ కూచిభొట్ల