భార్గవ గొట్టుముక్కల దర్శకత్వంలో షేక్ బాబు సాహెబ్ (బాబుషా) నిర్మించిన సందేశాత్మక హాస్యరస కుటుంబ కథా చిత్రం “వధు కట్నం” .గ్రీన్ క్రాస్ థియోసోఫికల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ సమర్పణలో షబాబు ఫిలిమ్స్ పతాకంపై శ్రీ హర్ష, ప్రియా శ్రీనివాస్, రఘు జి. కవిత శ్రీరంగం,ఆర్యన్ గౌర, రేఖ ఇందుకూరి, జాన్ కుషాల్, ఆనోణ్య, పాణిగ్రహి, మణిచందన ప్రధాన పాత్రలు పోషించారు. ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్’ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కుమారి షర్మిల భార్గవి వ్యాఖ్యా నించారు. ప్రముఖ నటి,నర్తకి, ‘మానవ హక్కుల సంఘం’ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి నాగలక్ష్మి ఇంజి ఆద్వర్యంలో చిత్ర నిర్మాత, దర్శకులను సత్కరించారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా, మహిళలపై చూపుతున్న వివక్షతను రూపు మాపాలని, స్త్రీలను రక్షించి, గౌరవించాలని చెబుతూ నిర్మించిన ఈ చిత్రం పూర్తి హాస్య రస కుటుంబ కదా చిత్రం. యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉందని అభినందించారు.
భార్గవ గొట్టిముక్కల మాట్లాడుతూ… ప్రస్తుత సమాజంలో ఇంకా మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని, స్కానింగ్ లో ఆడ శిశువు అని తెలుసుకొని కొందరు అబార్షన్ చేయించడం వల్ల ఆడపిల్లల శాతం తగ్గి పెళ్లికి మగపిల్లలకు, ఆడపిల్లలే దొరక్కపోతే వాళ్లకే “వదు కట్నం” ఇవ్వాల్సిన రోజులు వస్తాయన్న మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.
నిర్మాత షేక్ బాబు సాహెబ్ (బాబుషా) మాట్లాడుతూ… అన్యాయాలను ప్రశ్నించే మహిళా నాయకురాలి పాత్రలో ప్రముఖ నటి మనిచందన నటించారు. ఇందులో ఉన్న పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సెన్సార్ వాళ్ళు సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన మా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెల 31న విడుదల చేస్తామని చెప్పారు.
ఈ చిత్రానికి పాటలు : శ్రీరాం తపస్వీ, మ్యూజిక్ : ప్రభు ప్రవీణ్ లంక(నాని), సినిమాటోగ్రాఫర్ :యస్ డి.జాన్, ఎడిటర్ : సునీల్ మహారణా.