`సైరా నరసింహారెడ్డి `మెగాస్టార్’ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది. సినిమాను అక్టోబర్ 2న విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. చిత్ర నిర్మాత రామ్‌చరణ్ సినిమా ప్రమోషన్స్‌పై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాలనుకుంటున్నారట. అందుకు కారణం భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ సినిమాను హిందీ సహా దక్షిణాది భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. కాబట్టి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారట.
దేశమంతటా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకునేలా ట్రైలర్ వేదికను రామ్‌చరణ్ ప్లాన్ చేశారట. ఇంతకూ ఆ వేదిక ఏదో కాదు.. సైమా వేదిక అని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల ఖతార్‌లో 15, 16 తేదీల్లో సైమా అవార్డ్స్(సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తారని టాక్. ఇంత పెద్ద అవార్డ్ ఫంక్షన్ వేదికపై ట్రైలర్‌ను విడుదల చేస్తే జనంలోకి బాగా వెళ్తుందని మెగా క్యాంప్ భావిస్తుందట.
చిరంజీవి బరిలో దిగాల్సిందే !
‘సైరా’ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఎడిటింగ్ టేబుల్‌పై ‘సైరా’కు బిగ్ ఛాలెంజ్ ఎదురవుతోందట. ఈ సినిమాని ఎంత కట్ చేసినా 3.30 గంటల నిడివి కనిపిస్తోందట.ఆ మొత్తం ఫుటేజ్ నుంచి ఇంకా ఏం తీసేయాలి? అన్నదానిపై దర్శకుడు సురేందర్ రెడ్డి తర్జనభర్జన పడుతున్నారని తెలిసింది. ఎడిటర్‌తో కలిసి ఆయన ఇప్పటికే చాలా వరకు ట్రిమ్ చేశారు. ఇంకో అర్థగంట నిడివిని తగ్గించి తీరాలనేది ఓ టాస్క్. అయితే ఈ విషయంపై దృష్టి సారించాలంటే మెగాస్టార్ చిరంజీవి బరిలో దిగాల్సిందేనన్న మాట వినిపిస్తోంది.ఎడిటింగ్ టేబుల్‌పై ఎన్నో సందర్భాల్లో రన్ టైమ్ తగ్గించే బాధ్యతను చిరు తీసుకుని విజయవంతంగా ఆ పని పూర్తి చేశారు. చిరు దృక్కోణంలోంచి దర్శకుడు పరిశీలిస్తే ఎడిటింగ్ చాలా సులువు అయిపోతుందని కొందరి కామెంట్.
అక్టోబర్ 2న ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈలోగానే ఎడిటింగ్ సహా విఎఫ్‌ఎక్స్ పెండింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది.చివరికి ఏం చేసినా ‘సైరా- నరసింహారెడ్డి’ నిడివి 3 గంటలకు తేవాల్సి ఉంది. అందుకే ఇప్పుడు చిరు అందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పుడే రన్‌టైమ్ 30 నిమిషాలు తగ్గించగలిగితే ఆ మేరకు విఎఫ్‌ఎక్స్ పనులకు అదనపు ఖర్చు కూడా తగ్గుతుంది.