చిరంజీవి ,మెహర్ రమేష్ కాంబినేషన్లో భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు క్లాప్ కొట్టగా.. వి వి వినాయక్ కెమెరామెన్ స్విచ్ ఆన్ చేశారు. కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బాబీ, గోపీచంద్ మలినేని, ఎన్ శంకర్, రైటర్ సత్యానంద్ కలిసి స్క్రిప్ట్ ను మేకర్స్ కి అందజేశారు.
మెహర్ రమేష్ మాట్లాడుతూ..‘ఏడాదిన్నర కష్టపడి రెడీ చేశాం.సత్యానంద్ గారి ఆధ్వర్యంలో స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఇది మంచి కథ, సిస్టర్ సెంట్రిక్ కథ. చిరంజీవి గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. నా శక్తినంతా ఇందులో పెడతాను. కమర్షియల్గా అందరికీ నచ్చేలా చేస్తాను. సిస్టర్ పాత్రకు కీర్తి సురేష్ ఓకే అయ్యింది. అయితే కథ చెప్పేటప్పుడే తమన్నా అని అనుకున్నాము. ఇందులో సాంగ్స్ ప్రత్యేకంగా ఉండబోతోన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్గా సాగర్ని అనుకున్నాను అంటే.. అనిల్ గారు, చిరంజీవి గారు వెంటనే ఓకే చెప్పారు. అందరూ అన్నయ్యను భోళా శంకర్ అని అంటారు. ఈ టైటిల్ పెట్టడంతో వైబ్రేషన్స్ మారిపోయాయి’ అని అన్నారు.
అనిల్ సుంకర మాట్లాడుతూ.. ‘గత ఏడాదిగా ఈ స్క్రిప్ట్ మీద మెహర్ రమేష్ గారు ఎంతో వర్క్ చేశారు. మా హీరోయిన్ తమన్నాను మళ్లీ రిపీట్ చేస్తున్నాం.. సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ను కంటిన్యూ చేస్తాం’ అని అన్నారు.
కేఎస్ రామారావు మాట్లాడుతూ.. ‘చాలా ఏళ్ల తరువాత ఇది నాకు చాలా మంచి రోజు. అనిల్, రమేష్ గారు నన్ను మరి చిరంజీవికి మళ్లీ దగ్గర చేశారు. భవిష్యత్తులోనూ ఇంతే ఎనర్జీతో ముందుకు వెళ్తాం’ అని అన్నారు.
తమన్నా మాట్లాడుతూ.. ‘ఈ ఏడాదిలో చాలా సినిమాలు చేశాను. ఇక కాస్త బ్రేక్ తీసుకుందామని అనుకున్నాను. కానీ మెహర్ గారు నన్ను అడిగారు. ఇందులో నన్ను మెహర్ గారు అద్బుతంగా చూపిస్తారు అని అనుకుంటున్నాను. ఇన్నేళ్ల తరువాత రీమేక్ చేస్తున్నారంటే.. ఆ కథలోని బలం. కెమెరామెన్ డడ్లీ ఎప్పుడూ నన్ను అందంగానే చూపిస్తారు’ అని అన్నారు.
చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను నటీ నటులు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ గరికిపాటి,
డీఓపీ :డడ్లీ, సంగీతం : మహతి స్వర సాగర్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, దిలీస్ సుబ్బరాయన్, కెచ్చా,
కొరియోగ్రఫర్ : శేఖర్ మాస్టర్, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, కాస్లర్ శ్యాం, శ్రీమణి, సిరా శ్రీ