‘కామెడీ కింగ్’ సప్తగిరి కథానాయకుడిగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత డా.రవికిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో సూపర్‌డూపర్ హిట్ అయిన ‘జాలీ ఎల్.ఎల్.బి’ పార్ట్-1ని ‘సప్తగిరి ఎల్ఎల్బి’గా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత డా.రవికిరణ్ మాట్లాడుతూ ”మా చిత్రం ట్రైలర్‌ను రామ్‌చరణ్‌గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ వచ్చి బిజినెస్ కూడా బాగా జరుగుతోంది. మా బేనర్లో నిర్మించిన తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సూపర్‌హిట్ అయింది. దాన్ని మించిన విజయం సాధించేలా వుంటుంది. డెఫినెట్‌గా ‘సప్తగిరి ఎల్ఎల్బి’ రెండో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తాం” అన్నారు.
హీరో సప్తగిరి మాట్లాడుతూ ”హీరోగా నేను నటించిన మొదటి చిత్రం ఆడియో ఫంక్షన్‌కి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌గారు విచ్చేసి నన్ను ఆశీర్వదించారు. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘సప్తగిరి ఎల్ఎల్బి’ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌గారు అంగీకరించడం చాలా ఆనందంగా వుంది. మెగాస్టార్ చిరంజీవిగారి అభిమానిని అవడం నా అదృష్టం. మెగా ఫ్యామిలీ నాకు అందిస్తున్న సహకారానికి జీవితాంతం రుణపడి వుంటాను. మంచి సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ‘సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది” అన్నారు.
కామెడీ కింగ్ సప్తగిరి సరసన కశిష్ వోరా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: విజయ్ బుల్గానిన్, కో-డైరెక్టర్: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్.ఆర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: అర్జున్, పాటలు: చంద్రబోస్, కందికొండ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్, దర్శకత్వం: చరణ్ లక్కాకుల.