చాలామంది హీరోలు పరాజయాల తరువాత తమ పారితోషికాన్ని తగ్గించుకుంటుంటారు. హీరోల పారితోషికం వారి సినిమాల ఫలితంపైనే ఆధారపడి ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్. వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొనే హీరోలు తమ రెమ్యూనరేషన్‌ను తగ్గించుకోవాల్సిందే. హీరో రవితేజ కూడా అలాగే చేశాడు. ‘రాజా ది గ్రేట్’ సినిమాకు ముందు కొన్నేళ్ల పాటు ఫ్లాప్స్‌ను ఫేస్ చేసిన రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమా కోసం రెమ్యూనరేషన్‌ను తగ్గించుకున్నాడని వార్తలు వినిపించాయి. ‘రాజా ది గ్రేట్’ సినిమా విషయంలో పారితోషికంతో పాటు లాభాల్లో కొంత వాటా తీసుకోవాలని రవితేజ అండ్ దిల్ రాజు ఒక అంగీకారానికి వచ్చాడని టాక్ వినిపించింది. ఈ లెక్కన రవితేజకు ‘రాజా ది గ్రేట్’ సినిమాకు గానూ 8 నుంచి పది కోట్ల వరకు గిట్టుబాటు అయి ఉంటుందని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ‘రాజా ది గ్రేట్’ తరువాత రవితేజ తన పారితోషికాన్ని భారీగా పెంచే ఆలోచనలో ఉన్నాడని వార్తలు ఊపందుకున్నాయి.ప్రస్తుతం నటిస్తున్న ‘టచ్ చేసి చూడు’ సినిమాను మినహాయించి కొత్తగా కమిటయ్యే సినిమాలకు తన కొత్త రెమ్యూనరేషన్‌ను వర్తింపజేయాలని చూస్తున్నాడట మాస్ హీరో. తనతో సినిమా చేసేందుకు ముందుకొచ్చిన ఎన్ఆర్ఐ నిర్మాతలకు తన పారితోషికం రూ. 13 కోట్లు అని చెప్పాడట రవితేజ. రవితేజ రెమ్యూనరేషన్ 13 కోట్లు కాకున్నా, పది కోట్లకు తగ్గకుండా ఉంటుందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి ‘రాజా ది గ్రేట్’ ‘మాస్ మహారాజా’ రవితేజకు ఇలా కలిసొచ్చింది….