విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరి, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బేనర్స్ పై విశ్వనాథ్ తన్నీరు, సురేష్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `యమ్6`. మారుతి, శ్రావణి, అశ్విని, ప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి జై రామ్ వర్మ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు జై రామ్ వర్మ మాట్లాడుతూ…“ యమ్6` సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఉంటూ కడుపుబ్బ నవ్విస్తుంది. అంతర్లీనంగా చిన్న సందేశం కూడా ఇచ్చే ప్రయత్నం చేశాం. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి“ అన్నారు.
నిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ….“దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా. చెప్పినదాని కన్నా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. మా హీరో మారుతికిది తొలి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించాడు.. ఏ విషయంలో రాజీ పడకుండా షూటింగ్ కంప్లీట్ చేశాం. సహకరించిన మా చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు“ అన్నారు.
హీరో మారుతి మాట్లాడుతూ…“ఇది నా తొలి సినిమా. నేను నటన నేర్చుకోలేదు. దర్శకుడు చెప్పింది చెప్పినట్లు ఫాలో అయ్యాను. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. విజయ్ బాలాజీ గారు సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది“అన్నారు.
గోవింద, హరిత, వంశీ, ఇంద్రతేజ, రహీం (రాకేష్ బాబు), మురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః విజయ్ బాలాజి; ఎడిటింగ్ః వంశీ కందాల; సినిమాటోగ్రఫీః మహ్మద్ రియాజ్; సౌండ్ ఇంజనీర్ః విష్ణు; సమర్పణః శ్రీమతి పార్వతి; నిర్మాతలుః విశ్వనాథ్ తన్నీరు, సురేష్.ఎస్; దర్శకత్వంః జై రామ్ వర్మ.