మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానము ప్రతిష్టించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 02-04-2018 నుంచి 05-04-2018 వరకూ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ ను శ్రీ పిఠం పరమహంస పరివ్రాజకాచార్యులు పరిపూర్ణానంద స్వామి లాంచ్ చేశారు.
హిందూ దేవాలయాల ప్రతిష్టాపన పీఠాధి పతి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ కమలానంద భారతి స్వామి వారిచే దీప ప్రజ్వలన, శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాదీశులు పరమహంస మాధవానంద సరస్వతి స్వామి, శ్రీ పిఠం పరమహంస పరివ్రాజకాచార్యులు పరిపూర్ణానందస్వామి, హంపీ విరూపాక్ష పీఠాధిపతి జగద్గురు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారి ఆశీస్సులతో ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా హైదరాబాద్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…
శ్రీ పిఠం పరమహంస పరివ్రాజకాచార్యులు పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, ` దేవుణ్ణి కోర్కెలు కోరి కూర్చుంటే కుదరదు. వాటిని సాకారం చేసుకోవడానికి ఏం చేయాలో అన్నీ చేయాలి. ఏ పనినైనా సాధించాలంటే బలమైన సంకల్పం ఉండాలి. దేవుణ్ణి నిత్యం భక్తి శ్రద్దలతో, నిష్ట, నియమాలతో పూజించాలి. అలాగే ప్రత్యేకమైన పూజలున్నాయి. వాటిని అందరూ పాటించాలి. అప్పుడే దైవ ప్రాప్తి కల్గుతుంది. నాలుగు రోజుల పాటు మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానం వారు ప్రత్యేక పూజల నిర్వహిస్తున్నారు. వాటిలో భక్తులంతా భాగం కావాలి` అని అన్నారు.
నాలుగురోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులందరికీ అన్ని రకాల వసతులు కల్పించాం. ఆ స్వామి వారి సేవలో అంతా భాగం కావాలని కోరుకుంటున్నామని దేవస్థానం ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్యనారాయణ శాస్త్రీ , రమేష్ బాబు, కేశవులు, రామలింగరాజు, మోహన్ కుమార్, శ్రీపావని తదితరులు పాల్గొన్నారు.
మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానము ద్వితియ వార్షికోత్సవ బ్రహ్మోతవ.. ప్లాట్ నెం-6, మిలటరీ డైరీ ఫామ్ రోడ్, కానాజీ గూడ, సికింద్రాబాద్