మనోజ్ నందం,ప్రియసింగ్ హీరో హీరోయిన్లుగా హెచ్ పిక్చర్స్ పతాకంఫై హసీబుద్దిన్ నిర్మాత గా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వంలో “ మనసైనోడు” చిత్రం రూపొందింది.ఈ చిత్రం ఆడియో విడుదల గురువారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ పాటలు ‘మధుర ఆడియో’ ద్వారా రిలీజ్ అయ్యాయి.చిత్ర ట్రైలర్ ను సురేష్ కొండేటి,ఆడియో బిగ్ సి డి ని గోపినాథ్ రెడ్డి లాంచ్ చేశారు.ఆడియో సి డి లను గోపినాథ్ రెడ్డి చిత్ర యూనిట్ కు అందజేశారు.
ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ …ఈ సినిమా డైరెక్టర్ చాలా బాగా చేశారు ప్రొడ్యూసర్ కి మంచి లాభాలు రావాలని హీరో హీరోయిన్ కి మంచి అవకాశాలు రావాలని అన్నారు. గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ…డైరెక్టర్ విజయవాడ వచ్చి నన్ను పిలవగానే ఇక్కడకు రావడం జరిగింది. ఈ అడియో పంక్షన్ పండుగలా జరిగింది ఈ సినిమా.. దేశభక్తి ,లవ్ మీద తీసినందుకు డైరెక్టర్ ని అభినంధిస్తున్నాను.ప్రొడ్యూసర్ హసీబుద్దిన్ మాట్లాడుతూ…నేను వేరే దేశం లో వున్నా నా దేశం కోసం ఏదో చేయాలని అనిపించేది. అందుకే ఈ సినిమా ద్వారా నా దేశం చాలా గొప్పదని చూపిస్తున్నాము అని అన్నారు.
డైరెక్టర్ సత్యవరపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… ప్రొడ్యూసర్ నాకు చాల ఫ్రీడమ్ ఇచ్చారు.మనోజ్ నందన్, ప్రియసింగ్ జంట చూడముచ్చటగా ఉoటుoదని, ఈ చిత్రoలో ఆరు పాటలకు సుభాష్ ఆనంద్ చక్కని సoగీతం అందిoచారు. “జయ జయ జయహే భారతావని సద్గుణ సమూపేత” అంటూ మన భారతదేశ గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకుని పాడుకునే విధంగా ఒక గొప్ప దేశభక్తి గీతాన్ని స్వర్గీయ డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారు రచిoచారు.మగవాళ్ళ జీవితాల్లో ఆడవాళ్ళ లేకపోతే ఎంత నష్టమో కాస్త చిలిపిగా ఒక పాటను భాస్కరభట్ల రచిoచారు.ప్రేమ కధలో కుటుంబ కధని జోడించి దేశానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా దేశభక్తిని యువకుల్లో నింపే విధంగా రూపుదిద్దుకున్న చిత్రం“ మనసైనోడు” అని అన్నారు.
సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ…ఈ చిత్రంలో ఆరు పాటలు చక్కగా కుదిరాయని, రీరికార్డింగ్ బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను, ఈ చిత్రంలో స్వర్గీయ డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారు రచించిన “జయ జయ జయహే భారతావని సద్గుణ సమూపేత” పాట ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు . ఇంకా ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి , గిరిబాబు ,రఘబాబు,కేదార్ శంకర్ ,సంగీత, మధుమని ,జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : టి.సురేందర్ రెడ్డి ,ఎడిటర్ : మార్తాండ్ .కె .వెంకటేష్ ,పాటలు : డా . సి . నారాయణ రెడ్డి ,భాస్కర భట్ల ,గోశాల రాంబాబు ,పూర్ణ చారి, సంగీతం : సుభాష్ ఆనంద్ ,నిర్మాత : హసీబుద్దిన్,కథ ,మాటలు ,దర్శకత్వం సత్యవరపు వెంకటేశ్వరరావు