మనోజ్ నందం, సౌందర్య జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్కడ నా ప్రేమ’. గాయత్రీ సినీ క్రియేషన్స్ సమర్పణలో నంది క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్ రామకృష్ణ, వడ్డే గోపాల్ నిర్మాతలు. ఏ ఎండీ హుస్సేన్ దర్శకత్వం వహించారు. ఘనశ్యామ్ సంగీతాన్ని అందించిన ‘ఎక్కడ నా ప్రేమ’ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్ రామకృష్ణ, వడ్డే గోపాల్ మాట్లాడుతూ…రెండు తరాల వ్యక్తిత్వాన్ని ఎక్కడ నా ప్రేమ చిత్రంలో చూపిస్తున్నాం. ప్రేమే జీవితంగా బతికే యువత నిర్ణయాలు, పిల్లల బాగు కోసం తపించే తల్లిదండ్రుల ఆరాటాలు కథలో ప్రధాన అంశాలుగా ఉంటాయి. స్వేచ్ఛ కోరుకునే యువతరం, అనుభవాన్ని చూసిన పెద్దలను ప్రతిబింబించేలా పాత్రలుంటాయి. ఆంక్షలు పెట్టిన కుటుంబ సభ్యులను వదిలి వెళ్లిన ఓ అమ్మాయిని కాపాడేందుకు యువకుడు చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. ఈ క్రమంలో వీళ్లకు ఎదురయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. మంచి ప్రేమ కథతో సినిమా సాగుతుంది. ప్రేమికుల్లోని ఆకర్షణ, మనస్పర్థలను దర్శకులు వినోదాత్మకంగా తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఫిబ్రవరి 22న ఎక్కడ నా ప్రేమ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. అన్నారు.
ఎల్బీ శ్రీరాం, గీతా సింగ్, జయలిలత, జబర్దస్త్ రాఘవ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – మోహన్ చంద్, ఎడిటర్ – నందమూరి హరి