‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మహేశ్ ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ‘సూపర్‌స్టార్’ మహేశ్‌బాబు ఈమధ్య తన సినిమాలకు ఎక్కువగా గ్యాప్ ఇవ్వడం లేదు. రిజల్ట్‌తో సంబంధం లేకుండా చకచకా షూటింగ్‌లను పూర్తిచేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మహేశ్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలని కష్టపడుతున్నాడు. ఇటీవల డెహ్రాడూన్‌లో సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో పూజహెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
తాజాగా ఫిల్మ్‌మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. అసలైతే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను సిద్ధం చేయాలని అనుకున్నారు. అయితే షెడ్యూళ్లలో తేడా రావడంతో పోస్ట్‌ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతాయని భావించి సినిమా విడుదలను వేసవికి వాయిదా వేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని అనుకుంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుంది కాబట్టి, కొంచెం సమయాన్ని తీసుకొని ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మహేశ్‌కు ‘భరత్ అనే నేను’ ద్వారా మంచి హిట్టు దొరికింది. అదే తరహాలో తన 25వ సినిమాను కూడా నెక్స్ ఏప్రిల్‌లోనే విడుదల చేసి హిట్టు కొట్టాలని ఆశిస్తున్నారు.
మహేష్ స్పెషల్ సాంగ్స్ సమ్‌థింగ్ స్పెషల్