‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పలు బిజినెస్‌లు చేస్తున్నారు. ఇప్పటికే ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు . గచ్చిబౌలిలో అధునాతన సౌకర్యాలతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుపుకోగా , ఇందులో మొత్తం 1638 సీటింగ్ కెపాసిటీ తో 7స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి . ఇక తాజాగా దుస్తుల బిజినెస్ ప్రారంభించేందుకు మహేష్ సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. కొద్ది సేపటి క్రితం టీమ్ మహేష్ బాబు ట్విట్టర్‌లో.. http://www.spoyl.in/mahesh-babu అనే వెబ్‌సైట్ లింక్‌ని షేర్ చేస్తూ..మీ ఆశీర్వాదంతోనే అంతా జరుగుతుంది. మిమ్మల్ని ఆశ్చర్యపరచే ఓ విషయం మేము షేర్ చేసుకుంటున్నాం. దీనిపైనే ప్రస్తుతం వర్క్ జరుగుతుంది. ఆ సీక్రెట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండని కామెంట్ రాశారు. దీనిని మహేష్ బాబు రీ ట్వీట్ చేశారు. ఇది ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్ కాగా, మరో రెండు రోజులలో ప్రారంభం కానుంది, ప్రస్తుతం కౌంట్ డౌన్ నడుస్తుంది. ‘ఇందులో లాగిన్ అయితే మహేష్‌ని కలిసే ఛాన్స్ కూడా పొందవచ్చు’ అని తెలిపారు. ఇప్పటికే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ ‘రౌడీ’ పేరుతో సొంత దుస్తుల బ్రాండ్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వంశీ పైడిపల్లి బర్త్‌డే పార్టీలో మహేష్
వంశీపైడిపల్లి ‘మహర్షి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో సామాజిక నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో కొద్ది రోజుల పాటు మహేష్, వంశీపైడిపల్లి ఫ్యామిలీస్ విహార యాత్రలకి వెళ్ళారు. అక్కడ అందమైన ప్రదేశాలు వీక్షించారు. ఈ రోజు వంశీ పైడిపల్లి బర్త్‌డే కావడంతో గత రాత్రి ఆయనతో కేక్ కట్ చేయించారు మహేష్. కేక్ పెడుతున్న ఫోటోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మహేష్ .. గత రాత్రి సరదా క్షణాలు గడిపాం. ‘హ్యాపీ బర్త్‌డే వంశీపైడిపల్లి.. రానున్న రోజులు నీకు అంతా మంచే జరగాల’ని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ అనే చిత్రంతో బిజీగా ఉండగా, ఈ మూవీ తర్వాత వంశీతో మరో సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది