అదే నిజమైతే ఈ సినిమా సంచలనమే !

మహేష్ 27వ సినిమా ఎవరితో అన్నదానిపై పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మహేష్‌బాబు 25వ సినిమా ‘మహర్షి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది. టాలీవుడ్ లో గతానికి భిన్నంగా ఇప్పుడు డిఫరెంట్ మూవీస్‌కు ప్లానింగ్ జరుగుతోంది. క్రేజీ కాంబినేషన్ల తో వందల కోట్లతో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సిద్ధ మవుతున్నారు. . ‘మహర్షి’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు మహేష్ ఓకే చెప్పినట్లుగా తెలిసింది. ఇదిలాఉండగా మహేష్ 27వ సినిమా ఎవరితో అన్నదానిపై పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి….
 
ఇందులో ప్రధానంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాకు అతను ఓకే చెప్పాడని అంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్‌తో కాదని… టాప్ డైరెక్టర్ రాజమౌళితో మహేష్ సినిమా చేస్తాడని చెబుతున్నారు. అయితే ఈ రెండు వార్తలు ఎంత మాత్రం నిజం కాదని… అసలు విషయం వేరుగా ఉందని తెలిసింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ 27వ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తాడని చెబుతున్నారు. ఈ సినిమాకు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ఈ చిత్రానికి మహేష్ ఇటీవల ఓకే చెప్పాడని సమాచారం. ఇప్పటివరకు మెగా హీరోలతో కాకుండా మరో స్టార్ హీరోతో పెద్ద సినిమా తీయని అల్లు అరవింద్ తన స్టైల్‌కు భిన్నంగా మహేష్‌తో సినిమాకు ఓకే చెప్పడం … ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా సంచలనమే సృష్టిస్తుంది .