సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ‘విజన్ ఆఫ్ భరత్’ పేరుతో మార్చి 6న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది.
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తారు.
టీజర్‌లోని విశేషాల్లోకి వెళ్తే…. మహేష్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొదలవుతుంది. ”చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ‘ఒకసారి ప్రామిస్ చేసి, ఆ మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ ఎ మ్యాన్’ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చెయ్యాల్సిన రోజు ఒకటొచ్చింది. పెద్దదే కాదు, కష్టమైంది కూడా. కానీ, ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాజ్ ఐ యామ్ ఎ మ్యాన్. వియ్ ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ. ప్రతి ఒక్కళ్ళకీ భయం, బాధ్యత ఉండాలి… ప్రామిస్” అంటూ మహేష్ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది. ఈ టీజర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న అంచనాలు భారీగా పెరిగాయి. సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ తరహాలోనే ఈ సినిమాలో కూడా మంచి సందేశం ఉండబోతోందన్నది అర్థమవుతోంది.
సూపర్‌స్టార్ మహేష్, హీరోయిన్ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్, ఎస్.తిరునవుక్కరసు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.
#TheVisionOfBharat from Superstar @urstrulyMahesh’s #BharatAneNenu
A @sivakoratala Film
@ThisIsDSP Musical
#DVVDanayya Production @DVVEnts
@Advani_Kiara @dop007 @DOP_Tirru
@ramjowrites @LahariMusic
#BharathAneNenuOnApril20th
https://youtu.be/orkPrGSAETs