‘సూపర్‌స్టార్’ మహేష్‌బాబు… బాలీవుడ్ ఎంట్రీకి భారీగా ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. మహేష్ బాలీవుడ్ఎంట్రీకి గతంలో పలు అవకాశాలు వచ్చి నా.. ఎందుకనో ఆసక్తి కనబరచలేదు. ముందుగా టాలీవుడ్లో తన స్థానాన్ని స్థిరపరుచుకున్న తర్వాతే ఇతర భాషాల్లో ప్రయోగాలు చేయాలని భావించారు. అందుకే ఇతర భాషల్లో నటించాలన్న ఆలోచనను విరమించుకున్నారు. మారిన ట్రెండ్‌లో సౌతిండియా స్టార్లు ఇరుగు పొరుగు భాషల్లోనూ పాపులారిటీ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ సౌతిండియాలోనే తిరుగులేని స్టార్. తన ప్రతిభను బాలీవుడ్‌కు విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఆ దిశగా సీరియస్‌గా ఆలోచించి మహేష్ తన ప్రణాళికల్లో వేగాన్ని పెంచారు. అయితే మహేష్‌బాబు వంటి ఛరిష్మా ఉన్న స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలంటే ఘనంగా ఉండాలి. అందుకే గత రెండు, మూడు సంవత్సరాలుగా ఆ ఆలోచన ఉన్నా.. సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు.
మహేష్‌లాంటి స్టార్ యూనివర్సల్ అప్పీల్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలంటే ఎస్.ఎస్.రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ బరిలోకి దిగితేనే బావుంటుంది. ఆ క్రమంలోనే మహేష్, రాజమౌళి సినిమా గురించి గత రెండు, మూడు సంవత్సరాలుగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే ఈ ఇద్దరి కలయిక మాత్రం సాధ్యపడ లేదు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి వినిపించిన ఓ స్టోరీ లైన్‌కు మహేష్ ఓకే చెప్పారట. దానిని పూర్తి స్క్రిప్టుగా మలిచి సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఇకపోతే బాహుబలి సిరీస్‌తో వరల్డ్ ఫేమస్ అయిన రాజమౌళి నిర్ధేశనంలో మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుందని నమ్రత, సూపర్‌స్టార్ కృష్ణ కూడా భావిస్తున్నారు.ఇక ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి దాని కోసం సుదీర్ఘ సమయాన్ని వెచ్చించనున్నారు. 20 20లో ఈ సినిమా విడుదలవుతుంది. అంటే, అప్పటివరకు మహేష్ఆగాల్సి ఉంటుంది.