‘బాహుబలి’ తర్వాత తెలుగు హీరోలను ఇతర భాషల ప్రేక్షకులు చూసే కోణమే మారిపోయింది. మన హీరోలను కేవలం తెలుగు స్టార్లుగా గుర్తించే రోజులు పోయాయి. ఇప్పుడు వాళ్లు బౌండరీలు దాటిపోయారు. దక్షిణాదిన అంతటా మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు. యూట్యూబ్‌లో, హిందీ ఛానళ్లలో డబ్బింగ్ సినిమాల జోరుతో ఉత్తరాదిన కూడా వారికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ‘బాహుబలి’ తర్వాత తెలుగు హీరోలను ఇతర భాషల ప్రేక్షకులు చూసే కోణమే మారిపోయింది. అయితే ప్రభాస్ కంటే ముందే మన సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఉత్తరాదిన గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ హీరోల ఫీచర్లు ఉండే మహేష్‌కు అక్కడి వాళ్లు బాగానే కనెక్ట్ అయ్యారు. అతను చేసిన కొన్ని యాడ్స్ టివిలో దేశవ్యాప్తంగా ప్రసారం అయ్యాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా మహేష్ అక్కడి వాళ్లకు చేరువయ్యారు.
ఈ నేపథ్యంలో మహేష్ ఓ హిందీ సినిమా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్‌కు సైతం అతనితో సినిమా చేసే ఉద్దేశం ఉన్నట్లుగా సంకేతాలు ఇంతకు ముందే అందాయి. కానీ ఈ సూపర్‌స్టార్ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేసింది లేదు. ఆ విషయం ఎత్తితే మహేష్ ఇంతకు ముందు నవ్వి ఊరుకునేవారు. లేదంటే ఆసక్తి లేదనేవారు. కానీ తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్లో మాత్రం అతను షాకింగ్ కామెంట్ చేశారు… “ఇక్కడ తెలుగులో సినిమాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని… బాలీవుడ్‌కు వెళ్లి సమయం వృధా చేసుకోవడం ఎందుక”ని మహేష్‌బాబు కామెంట్ చేశారు. ఓవైపు సౌత్ సినిమాల గురించి బాలీవుడ్ వాళ్లు గొప్పగా మాట్లాడుతుంటే… మహేష్ బాలీవుడ్ గురించి ఇలా కామెంట్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.అయినా మహేష్ కు కూడా బాలీవుడ్ లో చెయ్యాలని, దేశవ్యాప్తం గా పేరు తెచ్చుకోవాలని ఉండదా?…మంచి టైం కోసం చూస్తున్నాడేమో?