గోల్డెన్ సినీ క్రియషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ లో ప్రారంభం అయింది. మహేష్ భూమిక హీరో హీరోయిన్ గా సి.హెచ్ సుజాత నిర్మాతగా సజ్జాకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్ర నిర్మాత సుజాత మాట్లాడుతూ.. డైరక్టర్ కుమార్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాము. మా చిత్రాన్ని అందరూ సపోర్ట్ చెయ్యలి అని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ కుమార్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సుజాత గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు విలయిల్ పిలిప్స్ థామస్ చాల్ గారికి నా కృతజ్ఞతలు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ మంచి సినిమా చేస్తాను అన్నారు.
సీనియర్ ప్రొడ్యూసర్ రామరాజు మాట్లాడుతూ.. గోల్డెన్ సినీ క్రియషన్స్ లో వస్తున్న మొదటి సినిమా సక్సెస్ అవ్వాలి అని, సుజాత గారికి దర్శకుడు కుమార్ కి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు మాట్లాడుతూ.. ఇది ఒక మంచి సినిమా అవుతుంది అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ విలయిల్ ఫిలిప్స్ థామస్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నర్సాపురం పేరుపాలెం బీచ్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది జనవరి నుండి షెడ్యూల్ ప్రారంభిస్తామన్నారు.
హీరో మహేష్ హీరోయిన్ భూమిక లపై క్లాప్ శోభన్ బాబు కొట్టారు. స్విచ్ ఆన్ ప్రొడ్యూసర్ సునీత చేసారు.గౌరవ దర్శకత్వం సీనియర్ ప్రొడ్యూసర్ రామరాజు చేసారు. ఈ చిత్రానికి కెమెరా వాసు వర్మ, సంగీతం రాజేష్ రాజ్