మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ ముందు అనుకున్న ప్రకారం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోనుందట. పైగా ఫారిన్ షెడ్యూల్‌తో నే షూటింగ్ స్టార్ట్ అవబోతుందని తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్‌తో సినిమాల షూటింగ్ షెడ్యూల్సే కాదు.. లొకేషన్స్ కూడా మారుతున్నాయి.విదేశాల్లో షూటింగ్ చేయాలనుకున్న షెడ్యూల్స్‌కి మరో ఆప్షన్ వెతుక్కుంటున్నారు. అయితే మహేష్ బాబు సినిమా మాత్రం ముందు అనుకున్న ప్రకారం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోనుందట. పైగా ఫారిన్ షెడ్యూల్‌తో నే షూటింగ్ స్టార్ట్ అవబోతుందని తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రాన్ని14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ చిత్రం ప్రీ–లుక్ మరియు, మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
బ్యాంకింగ్ రంగంలో జరిగే స్కాముల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. లోకల్ బ్యాంక్స్‌ని మోసం చేసి ఫారిన్‌లో దాక్కున్న విలన్‌ని ఇండియాకి రప్పించే హీరోగా మహేష్ కనిపిస్తాడని టాక్. దీంతో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ చిత్రం షూటింగ్ ను ఫారిన్ షెడ్యూల్ తో మొదలు పెట్టాలనుకుంటున్నారట. అక్టోబర్ లేదా నవంబర్ మొదటి వారంలో ఈ చిత్రబందం అమెరికా వెళ్లనున్నట్టు సమాచారం. ఒక నెలరోజుల పాటు అక్కడ చిత్రీకరణ చేయాలనుకుంటున్నారట.ఈ షెడ్యూల్‌తో నే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. నెల రోజుల పాటు అక్కడ షూట్ చేశాక.. నెక్స్ట్ షెడ్యూల్ ఇక్కడికొచ్చి తీస్తారని సమాచారం. ఈ సినిమాలో కీర్తీ సురేష్ కథానాయిక అని టాక్. కెమేరామ్యాన్ మది. తమన్ సంగీత దర్శకుడు.
‘సరిలేరు నీకెవ్వరు’ సరికొత్త లుక్ !
మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. ‘సర్కారు వారి పాట’ సోషల్ మెసేజ్‌తో వస్తోంది.భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ నడుస్తుందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్. అలాగే, మహేష్ కొత్త లుక్‌తో వస్తున్నాడు. అయితే ఆ మధ్య ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్‌లో మహేష్ చాలా కొత్తగా.. న్యూ హేయిర్ స్టైల్‌లో కనబడుతూ అదరగొట్టాడు. అయితే ఆయన ఇలా ఓ సినిమాకు తన లుక్‌ను మార్చింది మాత్రం పూరి జగన్నాధ్ ‘పోకిరి’ సినిమాకే. ఆ సినిమా మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసింది. ఆ సినిమా అంత హిట్ అవ్వడానికి మహేష్ లుక్ కూడా ఒక కారణం అంటారు అభిమానులు .ఆ తర్మాత మహేష్ తన లుక్‌ను మార్చలేదు. కాగా మళ్ళీ ఇన్నేళ్లు తరువాత మహేష్ కొత్త లుక్‌తో వస్తున్నాడు. ‘సర్కారు వారి పాట’ లో మహేష్ మరోసారి పూర్తి కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు