‘అసలు కధ’ తెలిసి ‘షాక్’.. అయినా సర్దేశారు !

సూప‌ర్‌స్టార్ మహేష్ 25వ చిత్రం`మ‌హ‌ర్షి`. ఈ సినిమా గురువారం విడుద‌లైంది. వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం… దాదాపు పది సినిమాల సన్నివేశాలను మిక్స్ చేసి ఈ సినిమా తీశారని అనుకుంటున్నారు. విమర్శకులు కూడా అదే మాట అంటున్నారు. అయితే లెటెస్ట్ గా ఓ తమాషా క‌థ‌నం వినిపిస్తోంది. పది సినిమాలను కాపీ చేసి తీసిన ఈ చిత్రం కధ మరో దర్శకుడిదట. మ‌హ‌ర్షి మెయిన్ ప్లాట్‌తో ఇప్ప‌టికే మ‌రో ద‌ర్శ‌కుడు క‌థ‌ను సిద్ధం చేసుకుని రిజిస్ట‌ర్ చేయించుకున్నారు. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు, శ్రీవాస్‌.
 
ఈయ‌న మ‌హ‌ర్షి సినిమా క‌థ గురించి తెలియ‌గానే షాకయ్యారు.అయితే శ్రీవాస్‌ క‌థ నాదంటూ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌కు ఫిర్యాదు చేయ‌లేదు. గొడ‌వ పెట్ట‌లేదు. `మ‌హ‌ర్షి` చిత్రానికి ముగ్గురు నిర్మాతల్లో ఒక‌రైన దిల్‌రాజుని నేరుగా వెళ్లి క‌లుసుకున్నారు. అందుకు కార‌ణం దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఇది వ‌ర‌కు శ్రీవాస్ `రామ రామ కృష్ణ కృష్ణ‌` సినిమా చేశారు. ఆ ప‌రిచ‌యంతో స‌మ‌స్య‌ను దిల్‌రాజు దృష్టికి తీసుకెళ్లారు శ్రీవాస్‌. త‌మ `మ‌హ‌ర్షి` సినిమా క‌థ‌.. శ్రీవాస్ రాసుకున్న క‌థ ఒకేలా ఉండ‌టం దిల్‌రాజుకి కూడా షాకింగ్‌గా అనిపించింది. అయితే నిర్ల‌క్ష్యం చేస్తే స‌మ‌స్య పెరుగుతుందే త‌ప్ప‌.. త‌గ్గ‌ద‌ని గ్ర‌హించిన దిల్‌రాజు, శ్రీవాస్‌కు స‌ర్దిచెప్పారని స‌మాచారం. దిల్‌రాజు హామీతో శ్రీవాస్ వెన‌క్కి త‌గ్గార‌ని అంటున్నారు.