సూపర్ స్టార్ మహేష్ బాబు మేడం టుస్సాడ్స్ సింగపూర్ ఆధ్వరంలో తన ప్రపంచంలో తొలి, ఏకైక మైనపు బొమ్మని మార్చ్ 25 న హైదరాబాద్ లో ఆవిష్కరించనున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు ఒక ప్రముఖుని ప్రతిమ ని సింగపూర్ లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అభిమానులు ముమ్మూర్తులా తమ అభిమాన హీరో ని పోలివుండే ప్రతిమ తో సెల్ఫీలు, ఫోటోలు పంచుకునే అవకాశం లభిస్తోంది. తర్వాత మహేష్ మైనపు ప్రతిమ మేడం టుస్సాడ్స్ సింగపూర్ లో అంగరంగ వైభవంగా జరిగే ఐఫా ఉత్సవాల్లో భాగం కానుంది.
తెలుగు సినిమా లో అత్యంత విజయవంతమైన నటులు, హీరోల్లో ఒకరైన మహేష్ ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ‘మేడం టుస్సాడ్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 23 శాఖల్లో అంతర్జాతీయ ప్రముఖుల మైనపు ప్రతిమలు తయారు చేసి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులకు వారి అభిమాన ప్రముఖుల్ని కలిసే అనుభూతిని ఇస్తోంది. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు తన ప్రతిమని ఆవిష్కరిస్తున్న సందర్భంగా …
సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ, ” ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఈ గౌరవానికి చాలా సంతోషంగా ఉంది. ప్రతిమ తయారు చేయడానికి కావాల్సిన కొలతలు, ఇతర వివరాలు తీసుకోవడానికి నాలుగు గంటలు పట్టింది. అభిమానుల లాగానే, నేను కూడా మేడం టుస్సాడ్స్ వారి నా మైనపు బొమ్మని చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.” అన్నారు.
ప్రతిమలు తయారు చేయడంలో సిద్ధహస్తులైన మేడం టుస్సాడ్స్ వారి నిపుణుల బృందం హైదరాబాద్ వచ్చి మహేష్ బాబు ని కలిసి 200 కి పైగా కొలతల్ని, అన్ని వివరాలని సేకరించారు. అచ్చం మహేష్ ని పోలి ఉండేలా బొమ్మ ని తయారు చేయడానికి జుట్టు, కళ్ళ రంగు వంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకున్నారు.
మేడం టుస్సాడ్స్ సింగపూర్ జనరల్ మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ, ” మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ ప్రతిమని తయారు చేయడం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాం. భారతదేశం నలుమూలల నుండి టూరిస్టులు మా శాఖని సందర్శిస్తుంటారు. భారతీయ సినీ ప్రముఖుల్ని వారికి అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం.” అన్నారు
Madame Tussauds Singapore presents first & only figure of Mahesh Babu
Singapore (22 February, 2019) Collaborating with Madame Tussauds Singapore, Tollywood superstar Mahesh Babu will be launching his first and only wax figure in the world on March 25th, 2019 in Hyderabad. This will be a special moment for Madame Tussauds Singapore as this will be the first time unveiling a prestigious figure outside of Singapore. Mahesh’s wax figure will join Madame Tussauds Singapore – the home of other A-list icons, the IIFA Award Experience and the new upcoming Ultimate Film Star Experience. All his fans will be able to get up close and grab their selfies with superstar Mahesh
very soon.
Mahesh – one of the most successful actors of Telugu cinema has had many achievements in his career. “I am quite excited for the honour and this is a moment to cherish. It took over four hours to get the measurements and other details. Like all my fans, I am also eagerly waiting to see my wax statue of Madame Tussauds” said Mahesh Babu.
The skilled Madame Tussauds sculpting team specially travelled to Hyderabad to meet Mahesh Babu and conduct a detailed sitting process. More than 200 measurements were taken; the team also matched the hair and eye color of the actor to ensure a truly authentic representation of the star.
Alex Ward, General Manager of Madame Tussauds Singapore said, “Mahesh Babu is a superstar and we are honoured to partner with him. To finally add a Tollywood star to our attraction is an important step. We receive many Indian tourists from all over the country and our goal is to represent the best of Indian cinema.”
Madame Tussauds Singapore continues to grow their attraction with more immersive experiences. In spring they will also launch the Ultimate Film Star Experience. Guests will go on a behind the scenes journey, where they will rise to fame. This experience will give guests the chance to audition for a leading role as they act, dance and star alongside superstars of Indian cinema surrounded by interactive technology!