సాయి బాబు, ఆశీరాం, సురయపర్విన్ హీరో, హీరోయిన్స్ గా “నీకై అభిసారికనై” చిత్రం విజయవంతంగా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుoదని..ఈ నెల 10 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభమైందని..ఈ నెలాఖరుకి షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుoటుందని – చిత్ర నిర్మాత సుగుణ తెలిపారు. అనిషా క్రియేషన్స్ పతాకమ్ పై సీనియర్ ఎడిటర్ వెంకట్రామ్ పల్లా దర్శకత్వంలో ఓ.సుగుణ నిర్మిస్తున్న చిత్రం “నీకై అభిసారికనై”
దర్శకుడు వెంకట్రామ్ పల్లా మాట్లాడుతూ… ఫైట్ మాస్టర్ రాబిన్ సుబ్బు నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని యూత్ ని ఆకర్షించే విధంగా లవ్ హారర్ ప్రధానంగా ఈ చిత్రం వుంటుందని వారు తెలిపారు. సినిమా పరిశ్రమలో దాదాపు 2 దశాబ్దాలు పైన సినీ ఎడిటర్ గా ఏంతో అనుభవమున్న నన్ను నమ్మి దర్శకత్వ అవకాశం ఇచ్చిన నిర్మాత సుగుణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. “నీకై అభిసారికనై” టైటిల్ లో మంచి ఫీల్ గుడ్ కనిపిస్తుందని చిత్ర యూనిట్ ప్రశంసించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని అతి త్వరలో సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకులు వెంకట్రావ్ పల్లా తెలిపారు.
సాయి బాబా, ఆశీరాం, సూరయ్యా పర్వీన్, నెహ్రు బాబు, రఘు బాబు, మచ్చా నాగభూషణ్, బాలాజీ, ధరణి, శ్రీనివాస రాజు, జబర్దస్త్ రాజమౌళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బాలాజీ, నిర్మాత : ఓ సుగుణ, కథా, స్క్రీన్ ప్లే, పాటలు , ఎడిటింగ్, దర్శకత్వం : వెంకట్రామ్ పల్లా, కెమెరా: ప్రసాద్, సంగీతం : రాజ్ కిరణ్, మాటలు : పి వి రామ రావు, డాన్స్ : సుధాకర్, ఫైట్స్ : రాబిన్ సుబ్బు