చిరంజీవి హీరోగా నటించి ఘన విజయం సాధించిన ‘పసివాడి ప్రాణం’ టైటిల్ తో వినూత్న టెక్నాలజీ తో ధన్ శ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై కొత్త హీరో అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరో హీరోయిన్లుగా , NS మూర్తి దర్శక , నిర్మాతగా చేసిన ఈ చిత్రం నవంబర్ లో రిలీజ్ కి ముస్తాబైంది .ఈ సందర్బంగా చిత్ర విశేషాలను తెలిపేందుకు వైజాగ్ లోని ప్రెస్ క్లబ్ లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టారు.
చిత్ర దర్శక, నిర్మాత NS మూర్తి మాట్లాడుతూ… టాలీవుడ్లో ఇంతవరకు రానటువంటి వినూత్నమైన ” లైవ్ కం యానిమేషన్ ” చిత్రం ఇది. అప్పటి పసివాడి ప్రాణం సినిమాలో పసివాడుగా నటించిన సుజిత మా సినిమాలో అతిముఖ్యమైన తల్లి పాత్రలో నటించారని తెలిపారు. నాకు స్వతహాగా అల్లు రామలింగయ్య ఫామిలీ అంటే బాగా ఇష్టం కాబట్టి అల్లు ఫ్యామిలీ నుంచి వంశీ ని హీరోగా పరిచయం చేశానని తెలిపారు.
హీరో అల్లు వంశీ మాట్లాడుతూ… నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం కల్పించిన NS మూర్తి గారికి రుణపడిఉంటానని, మూర్తి గారికి యానిమేషన్ లో అనుభవం ఉండటంతో షాట్స్ చాలా అద్భుతంగా వచ్చేలా శ్రద్ధ తీసుకున్నారని, ఈ సినిమాను ఖచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని నమ్ముతున్నానని తెలిపారు.
హీరోయిన్ ఇతి ఆచార్య మాట్లాడుతూ… తెలుగులో నాకిది మొదటి సినిమా అని , డైరెక్టర్ గారు సినిమా బాగా తీశారని, సక్సెస్ అవుతుందని తెలిపారు.
ఇంకా సాయి, యోగి, రుబినా , FM బాబాయ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు కెమెరా : కె.బుజ్జి, మ్యూజిక్ : GJ కార్తికేయన్ , కొరియోగ్రఫీ :చార్లీ, ఫైట్స్ : కుంగ్ ఫు శేఖర్, ఎడిటింగ్ : ప్రసన్న , స్టోరీ-స్క్రీన్ ప్లే -డైరెక్షన్ : NS మూర్తి