ఒకప్పుడు సినిమా దియేటర్లో సర్టిఫికెట్ మీద చూస్తే కాని సెన్సార్ గుర్తుకు వచ్చేది కాదు. ఇప్పుడు ఈ బోర్డ్ గురించి చిన్న పిల్లవాడికి కూడా తెలిసిపోయేంత పాపులర్ అయింది.అందుకు కారణం సెన్సార్ బోర్డ్ కూడా తరుచుగా మీడియాలో నానుతూ వుండటమే. సినిమాలో తీవ్రమైన హింసను, రక్తపాతాలను చూపించినా,అశ్లీల దృశ్యాలు,పదజాలాలు వాడిన నిర్ధాక్షిణ్యంగా ఆ సీన్స్ కి కోత పెడుతుంది సెన్సార్ బోర్డు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బాబూమోషాయ్ బందూక్ బాజ్ . ఈ చిత్ర విషయంలో సెన్సార్ బోర్డు తీరు వివాదాస్పదం అయింది. ఈ చిత్రానికి 48 చోట్ల సీన్లు కట్ చేయాలని ఆదేశించారు. దీంతో షాకైన చిత్ర దర్శక నిర్మాతలు రివైజింగ్ కమిటీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాగా బోర్డ్ మాత్రం సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.
‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్’ మూవీ కుషన్ నందీ దర్శకత్వం లో తెరకెక్కగా ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా , అతడికి జోడీగా బెంగాలీ నటి బిదితా బాగ్ నటించింది. సినిమాలో తొలుత నవాజ్‌కి జోడీగా చిత్రాంగద సింగ్‌ను తీసుకున్నారు. కానీ ఇందులో అభ్యంతకర సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఆమె సినిమా నుంచి తప్పుకున్నసంగతి తెలిసిందే.